చంద్రబాబు సీక్రెట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ తమ్ముళ్లు గోల పెట్టేస్తున్నారట. ఆ మధ్య తన ఫోన్ ట్యాపింగ్ అయిపోతోందని..  ఓ ముఖ్యమంత్రి కి కూడా ప్రైవసీ ఉండదా అని చంద్రబాబు గగ్గోలు పెట్టేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫోన్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా విజయవాడలోనే ఉండటం వల్ల ఫోన్ ట్యాపింగ్ ప్రాబ్లం కూడా అంతగా లేదు. 

మరి చంద్రబాబు సీక్రెట్లు ఎందుకు బయటకు వస్తున్నాయి.. అసలు ఏం బయటకు వచ్చాయనే కదా మీ అనుమానం.. ఇదేదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదు లెండి. కాకపోతే.. చంద్రబాబు కాన్వాయ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ పేపర్ బయటకు వచ్చిందట. జెడ్ సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకే నెంబర్ తో ఉండే కాన్వాయ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. 

అందులోని ఏకారులో చంద్రబాబు వెళ్తున్నారు.. ఆ కాన్వాయ్ లోని డ్రైవర్ల పేర్లు, సెల్ ఫోన్ నంబర్లతో కూడిన ఓ కాగితం ఇటీవల బయటకు వచ్చిందట. అసలే.. ఓసారి తిరుపతి అలిపిరిలో ఎటాక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబుకు భద్రత మరింతగా పెంచారు. అలాంటి బాబు సెక్యూరిటీ సీక్రెట్స్ ఎలా బయటకు వచ్చాయన్న సంగతి అంతుబట్టకుండా ఉందట. 

విజయవాడలోని క్యాంప్ ఆఫీసు నుంచి గుంటూరులోని గెస్ట్ హౌజ్ కు వెళ్తున్న సమయంలో ఈ వివరాలు బయటకు వచ్చాయట. చంద్రబాబు సెక్యూరిటీ విషయాన్ని ప్రత్యేక పోలీసులతో పాటు కృష్ణా,గుంటూరు జిల్లాల పోలీసులు చూసుకుంటారు. వారి మధ్య సరైన కో ఆర్డినేషన్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారట. అయితే ఇదంతా పుకార్లేనని.. బాబు సెక్యూరిటీ ఏర్పాట్లలో ఎలాంటి లోపం జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: