ఎల్ కే అద్వానీ మోడీ లేకుంటే ఈ పాటికి ప్రధాని అయ్యే రేంజ్ ఉన్న నేత .. బీజేపీ లో అగ్రగణ్యుడు , దేశాన్ని అప్పట్లో ఒక ఊపు ఊపిన వ్యక్తి మరి సోము వీర్రాజు? ఏపీ బీజేపీ లో పెద్ద లీడర్ 

సుష్మా స్వరాజ్:


సుష్మా స్వరాజ్ .. బీజేపీ మహిళా నేతల్లో అగ్రగామి , కేంద్ర మంత్రి .. మరి పురందరేశ్వరి? కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేయడం తో బీజేపీ లోకి దూకేసిన గోడ మీద పిల్లి వాటం నేత 

నరేంద్ర మోడీ:


నరేంద్ర మోడీ .. బీజేపీ ని ఎన్నడూ లేనంత ఆధిక్యం తో అధికారం లోకి పట్టుకుని వచ్చిన మాహా మేధావి .. మరి కావూరి సాంబశివరావు ? నేషనల్ పాలిటిక్స్ లో అనామకుడు

వెంకయ్య నాయుడు:


వెంకయ్య నాయుడు .. బీజేపీ పార్టీ వెన్నుముక, అప్పట్లో జాతీయ అధ్యక్షుడు కూడా ఇప్పుడ కేంద్ర మంత్రి .. మరి పైడి కొండల మాణిక్యాలరావు ? ఆయన ఎవరు ? అని అడిగే వారు లేకపోలేరు 


వీరంతా బీజేపీ నేతలే కానీ అగ్రగణ్యుల కీ కింది స్థాయి వారికీ ఎంతో తేడా ఉంది . ముఖ్యంగా మిత్ర పక్షం టీడీపీ దాని లీడర్ చంద్రబాబు విషయం లో భారీగా నే తేడాలు పబ్లిక్ గా కనిపిస్తున్నాయి అద్వానీ - సుష్మ - మోడీ - వెంకయ్య వంటివారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. చంద్రబాబుతో కలిసి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసినవారు. బీజేపీ - టీడీపీ కలిసి ఏపీ లో తెలంగాణ లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడం కోసం ఎప్పటినుంచో కలుస్తూ ఉన్న వారు. మిగితా వారు మాత్రం జాతీయ స్థాయిలో కాదు కదా రాష్ట్ర స్థాయి లో కూడా ఊరూ పేరూ తెలియని వారు. కానీ వారంతా ఎదో ఒక వంక తో చంద్రబాబు మీద ఆయన పాలన మీదా విమర్శలు చెయ్యడం, నిప్పులు చెరగడం లాంటివి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం లో భాగస్వామి గా చేర్చుకున్నందుకు బీజేపీ వ్యక్తి పైడి కొండల కి చంద్రబాబు రాష్ట్రం లో మంత్రి పదవి ఇచ్చారు కానీ చంద్రబాబు మీద ఆయన ప్రతీ రోజూ మండిపడుతూ నే ఉంటారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చంద్రబాబు మద్దతు తో గద్దెనెక్కి ఇప్పుడు బాబు పేరు చెబితే కారాలూ మిర్యాలూ నూరేస్తున్నారు. పథకాలు కేంద్రానివి అనీ బాబు మాత్రం తమవే అంటూ హడావిడి చేస్తున్నారు అనేది వారి ప్రధాన ఆరోపణ. ఇక పురందరేశ్వరి విషయం చెప్పనే అక్కర లేదు. ఆమె ఏకంగా ప్రత్యేక హోదా నే అవసరం లేదు అనేసిన మహా తల్లి. ఈ నలుగురు నాయకులూ రోజూ బాబు ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం బాబు తో చాలా సన్నిహితంగా మంచిగా ఉన్న సమయం లో ఆయనకీ వారు ఇచ్చే గౌరవం లో ఇక్కడి బీజేపీ జనాలు కించెత్తు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. చంద్రబాబు సైతం మిత్రపక్షాలు అన్న కారణం చేతనో, కేంద్రం తో తమకి ఉన్న అవసరాల దృష్ట్యా నో సైలెంట్ గా సాగిపోతున్నారు. చంద్రబాబే కనుక రాజకీయం మొదలుపెడితే వీరి పరిస్థితి ఏంటో !



మరింత సమాచారం తెలుసుకోండి: