ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారు..ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ఏర్పాటు చేయాలని ధృఢ సంకల్పంతో ఉన్నారు..ఇప్పటికే రాజధాని పేరు ‘అమరావతి’ అని నిర్ణయించారు. ఆ మద్య ఆంద్రప్రదేశ్ రాజదాని అమరావతికి సబందించి ఊహాచిత్రాలను ప్రభుత్వం విడుదల చేశారు. కొత్త గా నిర్మించ బోయే రాజధానిలా చాలా ప్రత్యేకతలు ఉంటాయని బాబు చెబుతున్నారు.


అరవై లక్షల మందికి నివాసానికి అనువుగా ఉండేలా ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు చెబుతున్నారు.మరో వైపు అమరావతి ప్రారంభ వేడుక అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు..ఇందుకోసం తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయట..వేడుకకు రాజీకీయ,సినీ,పారిశ్రామిక వేత్తలు హజరు కాబోతున్న సందర్భంలో కలర్ ఫుల్ గా కనిపించడానికి ఏమేం చేయొచ్చో సినీ దిగ్గజాల  దగ్గర సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. తాజాగా  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డును తయారు చేశారు.


బౌద్ద స్థూపం


ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మందిని ఆహ్వానించారు.  ఇక ఈ కార్డుపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద వహించినట్లుగా కనిపిస్తుంది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకునేలా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నసంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: