చర్మ సౌందర్యంపై నేటి యువతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. మరి పంచదారలో చర్మ రక్షణ అంశాలు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకుందామా? పంచదార మృతకణాలను నశింపజేస్తుందని బ్యూటీషియన్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుందని వారు చెబుతున్నారు. ప్రతి ఒక్క మహిళలు ఒక అందమైన, స్వచ్చమైన చర్మం సౌందర్యాన్ని కోరుకుంటుంది. అయితే, చాలా మంది మహిళలు మొటిమలు, డార్క్ సర్కిల్స్ మరియు ఇతర చర్మ సమస్యల భారీన పడుతుంటారు.


కొన్ని రకాల చర్మ సమస్యల వెనుక స్కార్స్ మరియు స్పాట్స్ ముఖం మీద దాగి ఉంటాయి. ఇటువంటి చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు, చిట్కాలను అనుసరించి ఉంటాయి. ఇంకా, కొన్ని రకాల క్రీమ్స్ మరియు జెల్స్ వంటివి అప్లై చేసినా కూడా అనుకొన్న ఫలితాలను ఇవ్వలేకపోవడంతో నిరాశ చెందుతుంటారు. కాబట్టి, మీ ముఖ చర్మంలో ఎటువంటి మచ్చలు, మొటిమలు, స్కార్స్ లేకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించండి.


కాంతివంతమైన ఫర్ ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి ఒది ఒక సింపుల్ హోం రెమెడీ . ప్రతి రోజు ముఖాన్ని మూడు, నాలుగు సార్లు ముఖం కడుక్కోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ ను తొలగిస్తుంది.  

క్లియర్ స్కిన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ స్కిన్ కేటర్ టిప్. నిమ్మ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మరియు పది రోజుల్లో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే షుగర్ కూడా నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్. ఈ రెండింటి కాంబినేషన్లో చర్మానికి స్క్రబ్ చేయాలి.  

స్వచ్చమైన చర్మసౌందర్యం పొందడానికి, వారానికి ఒకసారి మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయాలి. ఇలా కొన్ని సార్లు చేస్తుంటే మీ చర్మం శుభ్రపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. తాజా చర్మంను అంధిస్తుంది. 

ఇది మరొక కామన్ స్కిన్ కేర్ చిట్కా. ఒక స్వచ్చమైన కాంతివంతమైన చర్మంను పొందడానికి పాలతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, చర్మం మంచి షైనింగ్ తో ఉంటుంది. ఇంకా డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ మరియు సన్ టాన్ నేచురల్ గా తొలగిస్తుంది.  

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకొనే చేసి చర్మం లోపలినుండి మలినాలను శుభ్రం చేస్తుంది. దాంతో చర్మం స్వచ్ఛంగా మారుతుంది . మీ ముఖానికి ఆవిరి పట్టడానికి సమయం లేనప్పుడు, వేడినీటిలో ముంచి టవల్ ను బాగా నీళ్ళు పిండేసి , వేడి టవల్ ను మీ ముఖం మీద వేసుకోవాలి. 15నిముషాల తర్వాత తీయాలి. అప్పుడు చర్మ రంధ్రాలు తెరచుకొని, చర్మంరంధ్రాల్లో పూడుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించి మొటిమలు మచ్చలే రాకుండా కాపాడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: