చాలా మంది స్త్రీలు వారి సున్నిత భాగాలైన వక్షోజాలు, పిరుదులు, నడుం, యోని, పొత్తి కడుపు వాటిపై తాకనివ్వరు. చివరకు కట్టుకున్న భర్తను కూడా దూరంగా ఉంచుతారు. అయితే, పురుషులకు మాత్రం.. సున్నితమైన భాగాలను ముద్దు పెట్టుకోవటం, చూషించాలని ఆరాటపడుతుంటారు. కానీ, కట్టుకున్న భార్యకు ఇవేమీ ఇష్టం ఉండవు. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. సెక్స్‌లో పాల్గొన్నా త్వరగా పనిపూర్తి చేసుకోమని చెప్పి నిరుత్సాహ పరుస్తుంటారు. భర్తల వద్ద కూడా కొందరు మహిళలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటారు. ఇదే అంశాన్ని శృంగార నిపుణులను సంప్రదిస్తే.. కామాసక్తి లేని స్త్రీలు చాలా లైంగిక చర్యలను ఇష్టపడరని చెపుతున్నారు. తమతో శృంగారం జరుపుతున్నది భర్తనా లేక ప్రియుడా లేక పరాయి పురుషుడా అనే దాంతో వారికి పనిలేదు. ఒకవేళ భర్తతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. త్వరగా పూర్తి చేయమని తొందర పెడుతుంటారు. ఇలాంటి మహిళల్లో అసలు సెక్స్‌పై అసక్తి ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ ఆసక్తి లేకపోతే.. ఆ అనాసక్తికి గల కారణాలు వెతికి పట్టుకుని, తగువిధంగా కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. మన భార్యే కదా అని మొరటుగా ప్రవర్తించడం భావ్యం కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల మరింతగా దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆమె ఇష్టపడని కోరికలు ఎంతగా కోరితే ఆమెలో కామం పట్ల అంత వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: