కలియుగ దైవంగా భావించే శ్రీ సాయినాథుని చేరుకుని తమ బాధలు విన్నవిస్తే స్వామి తప్పక కరుణ చూపిస్తారని భక్తులు ధృడ విశ్వాసం. అయితే ఆ స్వామి సన్నిధి చేరాలంటే మనలోని అహాన్ని, రాగ ద్వేశాలను వదిలి వెళ్లాలలి అంటారు.  మనలో ఉన్న అహాన్ని సాయినాథుని పాదల వద్ద పెట్టాలి. తనకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్న సాయి పుర వీధుల్లో 'భిక్షాందేహీ' అన్నారు. కలిగొన్న వారికి కడుపునింపారు

అడిగిన వారికి, అడగనివారికి లేదనకుండా అవసరాన్ని కనిపెట్టి పంచిపెట్టారు. అదేపనిగా ఇతరులను నిందించడం, అకారణంగా దురభిప్రాయాలను ఏర్పర్చుకోవడం, తను నమ్మిందే నిజమనే భ్రమలో పొద్దుపుచ్చేయడం, అసూయ, ద్వేషాలతో రగిలిపోవడం, ఓర్వలేనితనంతో విరోధాలు తెచ్చుకోవడం, లేనిపోని భేషజాలతో ఆడంబరాలకు పోవడం, పెద్దల మాటల్ని లెక్కచేయకుండా గర్వంతో ప్రవర్తించడం... ఇవన్నీ దుర్లక్షణాలు. మహానుభావలు తమలోని స్వార్థ చింతనలన్నీ పక్కన పెట్టి పర సేవలో నిమగ్నం అవుతారు అందుకే వారు మహానుభావులు అవుతారు.  

సాయిమందిరం


ఓర్వలేనితనంతో విరోధాలు తెచ్చుకోవడం, లేనిపోని భేషజాలతో ఆడంబరాలకు పోవడం, పెద్దల మాటల్ని లెక్కచేయకుండా గర్వంతో ప్రవర్తించడం... ఇవన్నీ దుర్లక్షణాలు. మనసులో అంతర్లీనంగా గూడుకట్టుకుని ఉండే అహం అనే పొర ఈ లక్షణాలను కలిగిస్తుంది. ఈ దుర్లక్షణాలను వెంటనే సరిదిద్దుకోవాలని బాబా నొక్కి చెబుతుండేవారు. మనసును మాలిన్యం చేసే ఈ అవలక్షణాలను తొలగించుకుంటే ప్రతి ఒక్కరి మనసులు షిరిడీ శోభతో ప్రకాశిస్తాయి. ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగోడలుగా నిలిచే ఈ దుర్బుద్ధులను తుడిచి పెట్టేయాలంటే శ్రీ సాయి నామస్మరణే ఏకైక మంత్రం. శ్రీ సాయినాథాయ నమ:


మరింత సమాచారం తెలుసుకోండి: