ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగావున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.


పూజలో కొబ్బరికాయ కుళ్లిపోతే.. మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.


స్త్రీ తన ఎక్కువ వయసున్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో  శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదావ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: