నలభై రోజుల దీక్ష తీసుకుని మాల వేసుకుని కొండల మీద నడుచుకుంటూ వెళ్లి మరీ గుడిలో అడుగుపెట్టే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిని కోకొల్లలు గా చూస్తూ ఉంటాం. ఈ ఆలయం లో బహిస్టు అయినవారికి అనుమతి లేదు అనేది తెలిసిన విషయమే. ఆ మాటకొస్తే చిన్న పిల్లలూ, మొనేపాజ్ దశలో ఉన్న వారూ మాత్రమే ఇక్కడ అడుగుపెట్టే అవకాశం ఉంది.

 

 

 

 

ఇది ఎప్పటి నుంచో వస్తున్న వాదన. 10 నుంచి యాభై ఏళ్ళ వయసుఉన్న మహిళలకి ఇక్కడ ప్రవేశం లేదు అని ఆలయ బోర్డు చాలా సంవత్సరాల క్రితం ప్రకటించింది. ఈ విషయం లో బోర్డు ని హై కోర్టు కూడా సమర్ధించడం విశేషం. ఈ తీర్పు ని సుప్రీం కోర్టు లో యంగ్ ఇండియన్స్ సవాలు చేస్తూ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

 

 

 

 

 బోర్డు నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధం అని సుప్రీం చెబుతోంది. ఆలయం లోకి మహిళలకి అనుమతి లేకపోవడానికి తగ్గ సరైన కారణం చెప్పాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుడి నిర్వాహకుల తో పాటు, బోర్డు, కేరళ ప్రభుత్వం ఈ విషయంలో సరైన సమాధానం చెప్పాలి అనేది సుప్రీం ప్రశ్న. అనుమతి ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా వెంటనే చెప్పాలి అని సుప్రీం హుకుం జారీ చేసింది. అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించే బోర్డు ఫిబ్రవరి ఎనిమిది లోగా సమాధానం చెప్పాలి అని ఆదేశాలు జారీ చేసింది బోర్డు.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: