శివుడిని బిల్వపవూతాలతో పూజించుట శ్రేష్టం. బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావిస్తారు. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం పార్వతీ-పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అప్పుడు మహా దేవుడైన శంకరుడు శని దేవుని విధి ధర్మాన్ని పరీక్షించేందుకు ‘‘నీవు నన్ను పట్టగలవా?’’ అని ప్రశ్నిస్తాడు. అందుకు శనిదేవుడు ‘‘తమ అనుక్షిగహం ఉన్నంత వరకు నాకు అసాధ్యంమైందేదీ లేదు. తమర్ని అట్టే పట్టగలను. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు శివుని పట్టుకోగలనని’’ శివునితో పలికాడు.

శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలమందు శని నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్ష రూపాన్ని దాల్చి.. ఆ వృక్షం నందు అగోచరంగా వశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవాది దేవతలందరూ ముల్లోకాలను గాలించారు.శివ స్వరూపంగా బిల్వవృక్షం భావించబడుతున్నది. మొత్తం చతుర్దశ (14) భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచిక అంటారు. దీని మూలం (వేర్లు) గంధపుష్పార్చితం చేసేవారికి వంశాభివృద్ధి, ఈ వృక్షం చుట్టూ దీపారాధన శివజ్ఞానదాయిని, ఇంత విశేష మహిమగల ఈ మారేడు చెట్టు నీడన, ఒక్కరికి అన్నం పెట్టినా కోటిమందికి అన్నదానం చేసిన ఫలితం.

దీని క్రింద ఒక శివభక్తునికి క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, అట్టివాడికి జన్మాంతరాల యందు కూడా అన్నదారిద్ర్యం ఉండదు.  పుడిసెడు జలము బిల్వ దళంతో శివుడు సంతుష్టుడవుతాడు. దాన జప హోమాదులకంటే, ఎక్కువ తృప్తి కలిగించేది శివపూజ అభిషేకం. భక్తితో శివునికి అభిషేకం చేస్తే అభీష్టసిద్ధి అవుతుంది. మానవులే కాక, ఏ ప్రాణియైన, శివలింగాభిషేకంవల్ల, సర్వపాప విముక్తుడయి, పరమపదం పొందుతాడు.

మహాశివుడు


మృణ్మయ, దారు, శిలలతో దేనితోనైనా శివాలయం నిర్మించవచ్చు. మట్టితో కట్టిన ఆలయం కంటే దారువుతో నిర్మించిన ఆలయం, దారువుతో నిర్మించిన ఆలయంకంటే శిలతో నిర్మించిన ఆలయం, ఒకదానికంటే ఒకటి ద్విగుణీకృతమైన ఫలాన్నిస్తుంది. శిథిలమైన శివాలయం గట్టిపరచిన సర్వదోష నివారణ అవుతుంది. శివాలయ దర్శనం సర్వులకు అభీష్ట్ఫలదం.

మరింత సమాచారం తెలుసుకోండి: