భారతీయ సంప్రదాయాల్లోనూ, పూజాక్రతువుల్లోనూ, జీవన విధానాల్లోనూ గోవుకు అత్యంత ప్రాధాన్యముంది.. అయితే మరి ఆ గోవు విలువెంత అన్న అనుమానం ఒక రాజుగారికి కలిగింది. ఆయన తన ఆస్థానంలోని ఓ పండితుడిని ఈ విషయమై అడిగాడు. దానికి ఆ పండితుడు చిన్న కథ రూపంలో గోప్రాధాన్యాన్ని వివరించాడు. 

ఆ కథ ఏమిటంటే.. పూర్వం చ్యవనుడనే ముని ఉండేవారు. ఆయన 12 ఏళ్లపాటు నీటిలోనే ఉండే తపస్సు ప్రారంభించారు.  పన్నెండళ్లపాటు నీటిలో ఉండటం వల్ల చుట్టూ ఉన్న చేపలు మహర్షి స్పర్శకు అలవాటు పడిపోయాయి. కొన్నాళ్లకు జాలర్లు వల వేసిన సమయంలో చేపలతో పాటు ముని కూడా వలలో వచ్చారు. దాంతో జాలర్లు తమ తప్పును క్షమించమని మునిని కోరారు. 

ఆయన మీ తప్పేముంది నాయనా మీ వృత్తి ధర్మం పాటించారు. కానీ మీరు నన్ను ఆ చేపలను ఎవరికి అమ్ముతారో వారికే నన్ను కూడా అమ్మమన్నారు. దీంతో భయపడిపోయిన జాలర్లు తమ రాజును ఆశ్రయించారు. హుటాహుటిన అక్కడకు వచ్చిన రాజు.. ఆ మహర్షకి క్షమాపణలు చెప్పుకున్నారు. ముని మాత్రం తనను చేపలు కొనే వారికే అమ్మమని చెప్పాడు. 

దాంతో రాజు ఆ చేపలు తానే కొంటానన్నాడు. మరి మీ ధర ఎంతో చెప్పండి కొంటాను అన్నాడు. ఓ వెయ్యి వరహాలిస్తానన్నాడు రాజు.. వెయ్యి వరహాలేనా.. చాలా తక్కువ అన్నారు ముని.. పోనీ లక్ష.. అది కూడా తక్కువే.. కోటి.. అది కూడా తక్కువే.. చివరకు నా రాజ్యం కూడాఇస్తా... అదీ తక్కువే.. సంభాషణ ఇలా సాగడంతో ఏం చేయాలో పాలుపోలేదు ఆ రాజుకి. ఇంతలో అటుగా వచ్చిన మరో ముని.. ఓ గోవును ముని వెలగా నిర్ణయించమని సలహా ఇచ్చారు. 

చ్యవన ముని కూడా అందుకు సమ్మతించారు. చూశారా అదీ గోమాత విలువ. అందుకే గోమాతను ఉత్తమ ధనం అంటారు. గో దర్శనం, కీర్తనం, గానం ఎల్లవేళలా సకల శుభాలు కలుగజేస్తాయని ప్రతీతి



మరింత సమాచారం తెలుసుకోండి: