కాగితాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి.
నిప్పును కనిపెట్టిందెవరు?
మనిషి.
చక్రాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
పెద్ద పెద్ద ఇల్లు,బంగళాలు కట్టిందెవరు?
మనిషి
ఓడను కనిపెట్టిందెవరు?
మనిషి
విమానం కనిపెట్టిందెవరు?
మనిషి
కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
మనిషి
ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
మనిషి
కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
మనిషి
ఇంట్లో విశ్రాంతి,సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
మనిషి
ఏ face book,whatsap లలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం మనిషి
ఈ సమాజాన్ని నిర్మించిందెవరు
మనిషి ?
మతాలను,ధర్మాలను సృష్టించిందెవరు
మనిషి
మందిరము,మసీదు,చర్చి సృష్టించిందెవరు?
మనిషి
వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
మనిషి
విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ మనిషే సృష్టించాడు 
అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం.


మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు
1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.
2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని,చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.
3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి 
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.
4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు
ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా.
అందరూ చెబుతారు దేవుడొక్కడే అని.
కానీ కొసమెరుపు అది మా దేవుడే.
5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.
6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.
7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.
8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవచెయ్యమన్నారు
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!
9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.


ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో. వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం.
రచయిత
-మళ్ళీ వాడే మనిషి.



మరింత సమాచారం తెలుసుకోండి: