విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన మహరాజు శ్రీకృష్ణ దేవరాయలు ఒక్క రాజుగానే కాకుండా మంచి కళాభిమానం గల వ్యక్తిగా ప్రసిద్ది. ఆయన సంస్థానంలో కవులకు, రచయితలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.  శ్రీకృష్ణ దేవరాయలు మంచి కళాపోషన కలిగిన వ్యక్తి ..రాయల రాజ్యంలో రతనాలు అంగట్లో అమ్మేవారంటే రాజ్యం ఎంత సుభీక్షంగా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు. ఇక ఆయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణడు తెలియని వారు ఉండరు..కవిగా, వికటకవి గా ఖ్యాతికెక్కిన ఇతడు పాండురంగ భక్తుడు.  తెనాలి రామకృష్ణుడిపై ఎన్నో సినిమాలు, నాటికలు వచ్చాయి.  తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాయడమే కాకుండా ఎవరూ చేయని  ప్రయోగించిన కొన్ని అద్భుతమైన వాఖ్యాలు వర్ణనలు చేశారు.

 అంతే కాదు ఈ కావ్యం చదివితే దేవుడిపై భక్తి విశ్వాసాలు పెరగడమే కాదు..దురాలోచనలు, దుర్వ్యసనాలకు బానిసైన వ్యక్తిని పాండు రంగడు ఏ విధంగా తప్పించాడో మనకు తెలుస్తుంది. అంతే కాకుండా మద్యం అలవాటైన వ్యక్తులు దానికి బానిసలైన వారిని దాని బారి నుంచి తప్పించే దైవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

ఇక్కడ భగవంతున్న దర్శించుకున్న వారు చాలా మంది మద్యానికి దూరమైన వారే..అలాంటి మహిమ గల దైవ సన్నిధి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో ఉంది. ఇక్కడ వెలసిన పాండురంగ స్వామిని దర్శించుకుంటే మద్యం అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా మనుతారని అక్కడ ప్రజల నమ్మకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: