"అమర్దకం ఇదం కాశీ దుగ్ధేయంకిల జాహ్నవీ |
విశ్వేశో నాగనాథోయం భవానీ కనకేశ్వర||"


దక్షప్రజాపతి మహాయజ్ఞం చేసినపుడు తన అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదు. పార్వతికి ఇది అవమానం అనిపించింది. సహించలేక, ఆమె యజ్ఞకుండంలోకి దూకి భస్మం అయిపోయింది. ఈ సమాచారం విన్న శివుడు దుఃఖంతో తల్లిడిల్లిపోయి అడవులలో తిరుగనారంభించాడు. తిరుగుతూ, తిరుగుతూ అమర్దకం అనే ఒక విశాలమైన నదీ తీరాన ఉండసాగాడు. ఇక్కడ కూడా ఆయన కొన్ని అవమానాలు సహించవలసివచ్చింది. ఫలితంగా విరక్తి చెందిన శివుడు తన శరీరాన్ని కూా భస్మం చేసేసుకున్నాడు. ఆ తరువాత కొంత కాలానికి అటుగా వచ్చిన వనవానపు పాండవులు అమర్దకంలోనే తమ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. వారి ఆవులు ఆ నదిలో నీళ్ళు త్రాగానిక వచ్చేవి. నీరు త్రాగేక, వాటి పొదుగుల నుండి పాలనుధారలుగా అవి నదికి అర్పించేవి. ఒక నాడు భీముడు ఈ అద్భుతాన్ని తిలకించాడు. ధర్మరాజుకు ఈ విషయాన్ని వివరించాడు. అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు. "ఈ నదిలో ఎవరో దివ్యపురుషుడు ఉండి ఉంటాడు" వెంటనే పాండవులు నదిలోని నీటిని తీసివేయనారంభింారు. నది మధ్యలో ఉన్న నీరు ఉడుకుతూ వేడిగా ఉంది. అపుడు భీముడు తన గదతో నదిపై ప్రహారం చేశాడు. నీరు వెంటనే విడిపోయింది. అప్పుడే లోపల నీటికి బదులుగా రక్తధారలు కారనారంభించాయి. శంకరుని జ్యోతిర్లింగం నదీ గర్భంలో దివ్యంగా కానవచ్చింది.


పశ్చమ సముద్రతీరంలో పదహారు యోజనాల విస్తారంగల ఒక వనంలో దారుకుడు, దారుక ఉండేవారు. దారుకుడి దుష్ప్రవర్తనతో ఋషి, మునీశ్వరులు భీతావహులై ఓర్వముని శరణు జొచ్చారు. ఆయన దైత్యులందరూ నాశనమవ్వాలని శపించాడు. ఇక దేవతలు వారిపై ఆక్రమణ జరిపారు. ఇది చూసి రాక్షసులు చింతాక్రాంతులయ్యారు. పార్వతీ వరప్రసాది అయిన దారుక ఆవనాన్ని ఆకాశమార్గంలో ఎత్తుకుపోయి సముద్ర మధ్యంలో ఉంచింది. అక్కడే రాక్షసులందరూ నిశ్చింతగా ఉండసాగారు.నౌకలో సముద్ర మధ్యంలోకి వెళ్ళి రుషి, మనుషులను పట్టి తెచ్చి బందీలు గావించనారంభించారు. అలా ఒకసారి ఆ దుష్టులు పట్టి తెచ్చిన ఋషులలో సుప్రియుడనే శివభక్తుడున్నాడు. అతడు వైశ్యుడు. అతడు నిత్యం శివపూజ చేయనిదే అన్నపానాదులు ముట్టేవాడు కాదు. అతడు కారాగారంలో ఉంటూ కూడా శివుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూనే ఉండేవాడు.


రక్షకభటులు ఈ విషయాన్ని వారి ప్రభువులకు తెలిపారు. వెంటనే ఈ భక్తుడిని చంపేయవలసిందిగా ఆదేశం జారీ అయింది. ఇది వినగానే సుప్రియుడు శివుడిని మరింతగా ప్రార్థించనారంభించాడు. శంకరుడు ప్రత్యక్షం అయి తక్షణం ఆ రాక్షసులనందరినీ సకుటుంబంగా హరంచాడు. వెంటనే ఆ వనంలో నాలుగు జాతులకు చెందిన అన్ని వర్ణాలవారు నివసించే ఏర్పాట్లు గావించాడు. ఇటు దారకుడికి పార్వతీవరం  లభించిం ఉంది. ఫలితంగా దేవి ఆ యుగాంతానికి రాక్షసులను సృష్టించి, వారే ఆ దారుకకు శాశకులౌతారని తెలిపింది. శివుడు ఈ విషయాన్ని అంగీకరించాడు. అప్పుడు శివపార్వతులు అక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారి జ్యోతిర్లింగం నాగేస్వర నామధేయంతోనూ, పార్వతిని నాగేశ్వరిగానూ వ్యవహరిస్తారు.


నాగేశ ఆలయపు శిల్ప సౌందర్యం అద్భుతం. రాతితో కట్టబడిన, పాండవులనాటి ఈ ఆలయం విశాలంగా దృఢంగా ఉంటుంది. నాలుగు గోడలూ గట్టిగానూ, పెద్ద పెద్ద వరండాలూవంటి వాటిలో విశాలంగా ఉంటుంది. సభ మంటపం ఎనిమిది స్తంభాలపై ఉంది. మండపం గుండ్రంగా ఉంటుంది. సభ మంటపం, గర్భగుడి రెండూ సమానమే. కానీ ముఖ్య లింగ మూర్తినుంచిన ఆలయ గర్భగుడి అంతర్భాగం చిన్నది.ఈ మహాదేవుని ఎదుట నంది విగ్రహం లేదు. ముఖ్యాలయం వెనుకవైపు వేరే నందీశ్వరాలయం ఉంది. ముఖ్యాలయానికి నలువైపులా పన్నెండు చిన్నచిన్న జ్యోతిర్లింగాలయాలు ఉన్నాయి. ఇవిగాక, వేదవ్యాస లింగం, భండారేశ్వరుడు, చింతామణేశ్వరుడు, నీలకంఠేశ్వరడు, గణపతి, దత్తాత్రేయ, మురళీమనోహరుడు, దశావతారాలు ఇత్యాది అనేక ఆలయాలు, విగ్రహాలూ, తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ 108శివాలాలు, 68 తీర్థస్థానాలూ ఉన్నాయి.


నాగనాథ మందిరపు నిర్మాణం అతి సుందరమైనది. లోపలి భాగంలో ఒక ఋణమోచన తీర్థం ఉంది. రెండు ప్రదేశాలూ "అత్తా-కోడలు (సాంస్-బహూ) తీర్థం" అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. ఈ నాగనాథ తీర్థంలో ప్రతి12 ఏళ్లకూ ఒకసారి కపిలాషష్ఠి సమయంలో కాశీగంగ పదార్పణం జరుగుతుంది. ఆ సమయంలో తీర్థపు కోనేటి నీరు అతి నిర్మలంగా కనిపిస్తుంది. మిగతా మసయమప్పుడ ఇది శైవాలయుక్తంగా ఉంటుంది. నాగనాథాలయ పరిసరాల్లో అనేక దేవతల విగ్రహాలున్నాయి. ఇవికాక ఇతర జీవాలు, సైనికులు, కథలను చిత్రించే శిల్పాలూ ఎన్నో ఉన్నాయి. శిలా ఖండాలతో తయారైన ఈ విగ్రహాలు చూడచక్కగా ఉంటాయి. ఒక పెద్దమూలలో అలిగి ఉన్న పార్వతిని శివుడు బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఈ చెక్కడం అత్యంత రమ్యంగా ఉంటుంది. ఈ శిల్పంలో ప్రతిబింబించే హావబావాలు దీనిని సాటిలేని కళాకృతిగా చూపుతాయి. ఆ నందీ మహారాజ్, తుప్ కరీ మొదలైన వారి సమాధులు, విసోబాఖోచర్, నామ్ దేవ్ ల స్మృతి స్థానాలు ఇక్కడున్నాయి. గురుశిష్యుల కథ కూడా ఒకటుంది.


ఔంఢ్యా నాగనాథ క్షేత్రంలో 1212వ శకంలో సంత్ గోరా కుంభార్ ఇంటికి ఒకసారి సాధువలందరూ వ్చారు. ఆ సమావేశంలో సంత్ గోరా కుంభార్ అలవాటగా అందరి తలలపైన కుండలను పరీక్షించే విధంగా కొట్టి చూశాడు. చివరికి కుంభార్ అన్నాడు, "సాధువులందరి కుండలూ పరిపక్యంగా ఉన్నాయి. కేవలం నామ్ దేవ్ దే ఇంకా పక్వం కాలేదు" ఇది విని నామ్ దేవ్ కోపించాడు. అతడు పంఢరప్ పూర్ కు వెళ్లాడు. భగవాన్ విఠోబాత్ తో గోకాకుంభార్ విషయమై పితూరి చేశాడు. అప్పుడు విఠోబా ఇలా అన్నాడు. "నీవు ఇంతవరకూ ఎవరినీ గురువుగా స్వీకరించలేదు. అందుకే నీ జ్ఞానం ఇంకా పరపక్వం కాలేదు." నామ్ దేవ్ తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. తిరుగుతూ మళ్లీ ఔంఢ్యా నాగనాథ ఆలయాన్ని చేరాడు. మందిరంలో అతడు చూసిన దృశ్యం అతణ్ణి ఆశ్చర్యచకితుడిని చేసింది.


విసోబా ఖోచర్ పేరుగల ఒక వృద్ధ శివభక్తుడు నాగేశ శివలింగంపై తన కాళ్లనుంచి విశ్రాంతి తీసుకుంటూ అగుపించాడు. నామ్ దేవ్ ఇది చూసి భరించలేక  పోయాడు. వృద్ధునితో కోపంగా ఇలా అన్నాడు. "ఇదేం పని చేస్తున్నారు ? లింగమూర్తిపై కాళ్లూని, నిద్రిస్తున్నారా? వెంటనే కాళ్లు తీసి క్రింద పెట్టండి." దీని విసోబా ఇలా జవాబిచ్చాడు. "నేను వృద్ధుణ్ణి, కాళ్లు తీసి కిందపెట్టే శక్తి లేదు నాకు. మీరే ఆపని చేయండి బాబూ." లింగంపై నుంచి నామ్ దేవ్ వృద్ధుడి కాళ్లు క్రింద మరొక చోటున పెడితే, అక్కడ మరొక లింగం ఆవిర్భవించసాగింది. ఇలా వృద్ధుడి కాళ్లు ఎక్కడ పెడితే అక్కడొక శివలింగం కనిపించ సాగింది. చివరికి నామ్ దేవ్ ఆ వృద్ధుడిని తన గురువుగా స్వీకరించి, ఉదేశం చేయమని కోరాడు. గురుదేవ్ విసోభా ఖోచర్ నామ్ దేవ్ కు ఈ విధంగా ఉపదేశం చేశాడు. "భగవంతుడు అణువణువునా ఉన్నాడు. భగవంతుడులేని చోటు అంటూ ఏదీ లేదు." ఈ విధంగా ఖోచర్ రూపంలో నామ్ దేవ్ కు గురువు లభించాడు. ఔంఢయా నాగనాథ్ లో విసోబా సమాధి ఉంది. దీనిని గురుస్థాన్ అని పిలుస్తారు.


ఒకసారి సంత్ నామ్ దేవ్ ఔంఢయా నాగనాథ ఆలయంలో భజన చేద్దామనుకున్నాడు. అలాగే పాడనారంభించాడు. అదే సమయంలో ఒక బ్రాహ్మణ బృందం రుద్రమంత పఠనం చేస్తున్నారు. నామ్ దేవ్ చేస్తున్న భజన మూలంగా బ్రాహ్మణులకు తమ పూజలో అంతరాయం కలిగినట్లు అనిపించింది. వారు నామ్ దేవ్ ని గుడి వెనక కూర్చుని పాడుకోమన్నారు. నామ్ దేవ్ వారు చెప్పినట్లే గుడి వెనుక కూర్చుని పాడుకోనారంభించాడు. అప్పుడొక చమత్కారం జరిగింది. గుడి వెనక్కి తిరిగి పోయింది. శంకర భగవానుడు నామ్ దేవ్ పాటలు వినడానికన్నట్టు, తన ముఖద్వారాన్ని వెనక్కు త్రిప్పాడు. బ్రాహ్మణులు పశ్చాత్తాపం చెంది, నామ్ దేవ్ వద్దకు వెళ్లి తమ తప్పుకు సిగ్గిల్లుతున్నామని, క్షమించమని కోరారు.


ఒకసారి ధర్మాంధుడైన ఔరంగజేబు  ఆలయాన్ని నాశనం చేయబూనాడు. అప్పుడు గుడిలోంచి వేలకొలదీ కందిరీగలు బైటికి వచ్చి ఔరంగజేబు, అతని సైనికులపైనా పడికుట్టి తరిమేశాయి. గుడిని విరగ్గొట్టే పనిని మధ్యలో వదిలి ఔరంగజేబు అక్కడి నుండి పారిపోయాడు. భక్తులు, ధ్వంసం అయిన గుడిని తిరిగి బాగుచేశారు. అప్పుడప్పుడు నాగ నాథాలయ లింగమూర్తిపై పడగ విప్పిన నాగదేవత కానవస్తూంటుంది. అక్కడ గిన్నెలో ఉంచిన పాలను పాములు ఎప్పుడు తాగి వెళతాయో ఎవరికీ తెలియదు. 
జయ్ శ్రీ నాగనాథ్ ! జయ్ శ్రీ నాగనాథ్ !


ద్వాదశ జ్యోతిర్లాంగాలలో తొమ్మిదవ రూపం శ్రీ  విశ్వేశ్వరుడు, ఆయన కొలువైన క్షేత్ర విశిష్టత తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: