"వైద్యనాథేశ్వరం నామాతిల్లింగ భవన్మకేత|
ప్రసిద్ధం త్రిషులోకేషుః భక్తి ముక్తి ప్రదంనతాం ||
జ్యోతిర్లింగమిదం శ్రేష్టం ధర్మనాత్ పూజనాదపి |
స్వపాపహరం దివ్యం భుక్తివర్ధన ముత్తమమ్ ||
మానుషం దుర్లభం ప్రాణ్య వైద్యనాథన్య దర్శనం |
నకరోతి నరోయస్తు జన్మ నిరర్ధకమ్ ||"


కన్యాకుమారి నుంచి ఉజ్జయినికి మధ్య ఒక మధ్యరేఖ గీస్తే, ఆ రేఖ మీద పరళీ గ్రామం మధ్యలో ఉంటుంది. ఈ గ్రామం మేరు వపర్వతం లేక నాగనారాయణ పర్వతపు ఒక ప్రక్కగా ఉంది. బ్రహ్మ, వేణు, సరస్వతి, ఈ మూడు నదులకూ దగ్గరలో ఉన్న పరళీ ఒక ప్రాచీన గ్రామం. శంకరుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక పవిత్రస్థాన రూపం కావటాన్న, ఈ స్థానం యొక్క ప్రాధాన్యత మరింత ఎక్కువ. ఈ గ్రామాన్ని కాంతీపురమని, మధ్యరేఖ అని, వైజయంతి ఇంకా జయంతీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడే శంకరుడు పార్వతితో కలిసి నివసిస్తుంటాడు. ఈ విధంగా శివపార్వతులు జంటగా ఉండటం కేవలం ఈ పరళీ గ్రామంలోనే కానవస్తుంది. అందువల్ల ఈ ప్రదేశాన్ని "అపూర్వకాశీ (అనోభీ కాశీ)" అని కూడా పిలుస్తారు. దీనికి కాశీకున్నంత మహత్తు ఉండటం వల్ల ఇక్కడికొస్తే, కాశీకి వచ్చినట్లే అని భావిస్తుంటారు.


బీడ్ జిల్లాలో గల అంబేజోగాయి నుండి కేవలం 26కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అంటే జోగాయిలోని యోగేశ్వరి వివాహం పరళిలోని వైద్యనాథునితో నిశ్చయింపబడింది. కానీ అక్కడే శిలారూపులైపోయారు. ఇటు యోగేశ్వరి పరళి నుంచి దూరంగా కూచుని ఉండి పోయింది. ఈ కథ ఇక్కడ వినవస్తూంటుంది. అపారమైన జల సంపద, ఇక్కని గాలి, బాగా సువ్యవస్థితమైన ప్రయాణ సౌకర్యాలవల్ల పరళీ గ్రామం వ్యాపారంలో అగ్రగామి కేంద్రంగా కూడా ఉందిక్కడ. పరళీ గ్రామం చిన్నదే అయినా దీనికి తాసీలు మరియు జిల్లా వంటి ప్రాముఖ్యత ఉంది. గ్రామ పరిసరాలు పౌరాణిక ఘటనలకు సాక్షి కావటాన్న, దీనికి మరింత ప్రాముఖ్యత ఆపాదించబడింది.దేవదానవుల అమృత మంథన ప్రయత్నంలో పద్నాలుగు రత్నాలు బైట పడ్డాయి.  వాటిలో ధన్వంతరి మరియు అమృత రత్నాలున్నాయి. అమృతం పొందాలని దానవులు పరుగున వచ్చారు. విష్ణువు అప్పుడు అమృతాన్ని, ధన్వంతరినీ శంకర భగవానుని లింగమూర్తిలో దాచాడు. దానవులు లింగాన్ని స్పృశించబోతే అందునుండి జ్వాలలు చెలరేగనారంభించాయి. కానీ శంకర భక్తులు లింగాన్ని తాకితే అందునుండి అమృత ధారలు కురియ నారంభించాయి. నేటికీ భక్తులు ఈ లింగాన్ని దర్శించినపుడు తాకి దర్శిస్తారు. జాతి భేదం, లింగ భేదం అనేటువంటివి ఏమీ లేకుండా ఉంటుందిక్కడ. ఎవరయినా సరే దర్శనం చేసుకోవచ్చు. పావనం అవ్వచ్చు. లింగమూర్తిలో గల ధన్వంతరి మరియు అమృతం ఉన్న కారణన్న దీనిని అమృతేశ్వరుడనీ, ధన్వంతరీ అనీ కూడా పిలుస్తారు.


"వైద్యాభ్యాం పూజితం సత్యం, లింగమేత్పురాతనం |
వైద్యనాథమితి ప్రఖ్యాతం, సర్వకామప్రదాయకం || "

పరళీ గ్రామం వద్ద గల కొండలలో, నదుల తీరాల్లో, అడువులలో వైద్యానికి ఉపయోగపడే మూలికలు ఎన్నో లభిస్తాయి. అందువల్ల పరళీ జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ నామంతో కూడా పిలుస్తారు. విష్ణు భగవానుడు ఇక్కడే అమృతాన్ని ప్రసాదించాడు. అందుకని వైద్యనాథ తీర్ధాన్ని "వైజయంతి" అంటారు. ఒకసారి రాక్షసాధిపతి రావణాసురుడు కైలాస పర్వతానికి వెళ్ళి శివుణ్ణి ప్రసన్నుడిని చేసుకోవడానికై ఘోరతపస్సు చేశాడు. చలి, వేడి, ఎండ, అగ్ని వంటి కష్టాలను సహించి ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షశ్రం కాలేదు. ఇక రావణుడు తన తలను కోసి శివలింగానికి అర్పించనారంభించాడు. అపుడు శివుడు ప్రత్యక్షమై రావణుని తలలను వెనక్కు ఇచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు శివుణ్ణి లంకకు వచ్చి ఉండమన్నాడు. తాను తీసుకువెడతానని కోరాడు. భక్తవత్సలుడైన శంకరుడు ఎంతో ఉద్విగ్నుడైనాడు. కానీ భక్తుని కోరికను స్వీకరించాడు. " నా లింగాన్ని భక్తి పూర్వకంగా నీ ఇంటికి తీసుకువెళ్లు. కానీ మధ్యలో ఎక్కడైనా నేల మీద ఉంచితే నేనక్కడనే స్థిరపడిపోతాను" అన్నాడు.రావణుడు లింగాన్ని చేతబూని ఇంటి వైపు సాగిపోయాడు. మార్గ మధ్యంలో లఘుశంక తీర్చుకోవలసివచ్చింది. అక్కడ కనిపించిన ఒక గోపాలక బాలకుని చేతిలో లింగాన్నుంచి లఘుశంక తీర్చుకోవడానికి వెళ్లాడు. గోపాలక బాలకుడు లింగ భారాన్ని మోయలేక దానిని క్రింద పెట్టేశాడు. అంతే, శివుడు అక్కడే స్థిరపడిపోయి వైద్య నాథునిగా పేరు పొందాడు. 


దుష్టాత్ముడైన రావణుని వద్ద శివుడు నివసించబోతున్నాడనే వార్త విని దేవతలు ఖిన్నులయ్యారు. వారి కోరపై నారదుడు రావణుని దగ్గరకు వెళ్లి, అతని తపస్సును ప్రశంసించి ఇలా అన్నాడు " నీవు శివుణ్ణి నమ్మి మోసపోయినావు. శివుని మాట నిజమనుకోవడం నువ్వు చేసిన పొరపాటు. నీవు నీ ప్రతీకారం తీర్చుకోవడానికై అక్కడికెళ్ళి కైలాన్ని ధ్వంసం చేయ్ అదే నీలక్ష్య సిద్ధికి సూచన." నారదుడి మాటలు విని రావణుడు ఆపనే చేశాడు. దాంతో శివుడు ఆగ్రహించి రావణుని శపించాడు. "నీ భుజాలలోని అహంకార దమనం చేయగల శక్తి త్వరలోనే వస్తోంది" అని నారదుడు తన కార్య సాఫల్య వార్తను దేవతలకు అందించి, వారిని నిశ్చింతగా ఉండమని చెప్పాడు. ఇది విని దేవతలు సంతోషించారు. ఇటువైపు రావణుడూ కైలాసాన్ని నష్టం చేసిన ఆనందంతో ఇంటికి వచ్చాడు. శివుని మాయవల్ల అతడు సర్వ ప్రపంచాన్ని తన స్వాధీనం చేసుకోవాలని తలపోశాడు. అతని గర్వమణచడానికై భగవంతుడికి రామావతారం ఎత్తవలసి వచ్చింది.
పరళీ గ్రామం దగ్గర, ఒక ఎత్తైన ప్రదేశంలో రాతితో నిర్మించబడిన ఒక భవ్య మందిరం ఉంది. ఈ మందిరం నలువైపులా బలమైన గోడలున్నాయి. లోపల వరండాలు, ఒక పెద్ద ప్రాంగణం ఉన్నాయి. మందిరం బయట ఒక పెద్ద దీపస్తంభం ఉంది. మహ్వాద్వారం వద్ద ఒక మీనారు ఉంది. వీటి దిశలవల్ల మందిరంలో చైత్రం మరియు ఆశ్వీయుజమాసాలలో విశిష్ట దినాలలో సూర్యోదయ వేళ సూర్యుని కిరణాలు లింగమూర్తిపై నేరుగా పడతాయి. మందిరంలోనికి వెళ్లటానికి దృఢమైన పెద్దమెట్లు ఉన్నాయి. వాటిని ఘాట్ అంటారు. పాత ఘాట్ 1108వ సంవత్సరంలో నిర్మించబడింది.


మందిరంలో భగవానుడి గర్భగుడి, సభాగృహం రెండూ సమాన పరిమాణాలు గలవైనందున, సభాగృహం నుండే భగవద్దర్శనమౌతుంది. ఇతర చోట్ల ఈ విధంగా ఉండదు. మిగతా చోట్లలో భగవంతుడి గర్భగుడి లోపలికి ఉంటుంది. వైద్యనాథ లింగమూర్తి శాలి గ్రామ-శిలతో చేయబడింది. ఇది చాలా నున్నగా, భవ్యంగా ప్రన్న ముద్రతో ఉంటుంది. గుడిలో గర్భగుడికి నలువైపులా నందా దీపాలు వెలుగుతూ ఉంటాయి. శ్రీవైద్యనాథ మందిర శిథిలోద్ధారణ 1706లో శవిభక్తురాలయిన అహిల్యాదేవి హోల్కర్ పరళీ సమీపంలో గల త్రిశూలదేవి పర్వతంపై విశేషమైన రాతితో చేయించింది. అహిల్యాదేవికి ఈ తీర్థస్థానం బహుప్రియమైనది. మందిరపు భవ్యమైన సభామండపం స్వర్గీయ రామారావు నానా దేశ్ పాండే, గ్రామములోని పనివారు మరియు భక్తజనుల సహాయంతో నిర్మించారు. ఆయన స్మృతి రూపంగా వైద్యనాథ మందిరం దగ్గర ఒక రామరాజేశ్వర మహాదేవ మందిరం ఉంది. వైద్యనాథ మందిర ప్రాంగణంలోనే శంకరుడికి ఇంకో పదకొండు మందిరాలు ఉన్నాయి. వీరశైవ లింగాయత్ వైద్యనాథ తీర్థక్షేత్రం సర్వశ్రేష్టంగా భావిస్తారు.


శ్రీమంత్ పీష్వా ఈ దేవస్థాన వ్యవస్థకు పెద్ద జాగాను జాగీరుగా దానం చేశాడు. నేడు ఈ వ్యవస్థ ఒక సమితి ద్వారా నిర్వహింపబడుతోంది. ఇక్కడ చాలా మంగళ కార్యాలు జరుగుతుంటాయి. పర్యాటకులు ఇక్కడ బస చేస్తూంటారు.ఏ విధంగా అయితే పరళి శివభక్త స్థానమో, అదేవిధంగా ఇది హరిహర సంగమస్థానం కూడాను. ఈ సంయుక్త, పుణ్యమయ భూమిపై శంకరభగవానునితో బాటు కృష్ణ భగవానుని ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడి హరిహక తీర్థపు నీరు వైధ్యనాథుని దైనిక పూజకై తెస్తారు. ప్రతి సోమవారం ఇక్కడ భక్త జనులతో సందడిగా ఉంటుంది. 


చైత్ర పడవా అంటే ఉగాది, విజయదశమి, త్రిపురీ పూర్ణిమ, మహాశివరాత్రి మరియు వైకుంఠ చతుర్ధశి పండుగలప్పుడు చాలా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో బిల్వ, తులసీ పత్రాలలో ఏ తేడా ఉంటదు. మహాదేవునికి తులసీ దళాలు, విష్ణు భగవానునికి బిల్వ పత్రాలు అర్పించే విచిత్ర రీతి కేవలం వైద్యనాథ క్షేత్రంలోనే కానవస్తుంది. శ్రావణ మాసంలో జరిగే వైద్యనాథ పూజ, రుద్రాభిషేక మంత్రోచ్ఛారణలతో పరళి పరిసరాలు ప్రతిధ్వనిస్తాయి నతి్యపూజ కూడా చాలా శ్రద్ధా నిష్టలతో చేస్తారు.


ఈ పరళీ తీర్ధంలో చాలా ఏళ్ళక్రితం మార్కండేయుడు శివకృపచే జీవనదానం పొందాడు. మార్కండేయుడు, అల్పాయుష్కుడు అవడం వలన యమధర్మరాజు తీసుకుపోదలచినపుడు, శివుడు విడిపించాడు. ఆయన పేరుతో ఒక చెరువు ఉంది. సత్యవంతుడు, సావిత్రి కథ కూడా ఈ పుణ్యభూమికి చెందినదే. నారాయణ్ కి పహాడీ (కొండ)పై సావిత్రి కథలోని వటవృక్షం నేటికీ కానవస్తుంది. అక్కడే ఒక వటేశ్వర మందిరం కూడా ఉంది.రాజా శ్రీయాల్, రాణీ చాంగుణా ప్రియచిలియా బాలకుడు శివకృపవల్ల పునర్జీవితుడయ్యాడు. ఆ స్థానమే పరళీవైద్యనాథ ధామం  విఖ్యాత సంత్ జగన్మిత్రుడైన నాగనాథుని నివాసస్థానం కూడా పరళీయే. వారి సమాధి, ఆశ్రమం కూడా ఇక్కడ ఉన్నాయి.


జగన్మిత్ర నాగాజీ యొక్క జీవితం గురించి మిహవత్ బువా తాహరాబాద్కర్ తన పద్యరచన "భక్తి విజయం" గ్రంథంలో వ్రాశాడు. నాగాజీ పరళీ యొక్క విఠ్ఠల భక్త బ్రాహ్మణుడు. ఆయన భిక్షాటనం చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రాత్రింబవళ్ళు అతడు విఠల భక్తుడై కాలం గడిపేవాడు. ఒకనాడు రాత్రి అతని విరోధులు అతని గుడిసెకు నిప్పంటించారు. కానీ విఠల కృపవల్ల అతడు అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా బైటపడ్డాడు. గ్రామవాసులు తరువాత నాగాజీకి కొంత భూమిని జాగీరురూపంకగా దానం ఇచ్చారు. ఈ భూమిపైనే శ్రమించి ఏదో పండించి తన పరివారాన్ని చూసుకోసాగేడు. దుష్ట విరోధులకు అయినా సంతృప్తి కలగలేదు. ఒకసారి ఒక యవన అధికారి బదిలీ మీద పరళికి వచ్చాడు. నాగాజీ విరోధులు యవనుడి చెవిలో ఏవేవో చెప్పారు. యవన అధికారి మనసులో దురభిప్రాయం ఏర్పడింది. వెంటనే అతడు జగమిత్ర నాగాజీ భూమిని తీసేసుకుని, "నీవు గనుక నిజంగా జగన్మిత్రుడవే అయితే , నా వ్యక్తిగత పూజా పఠానికై ఒక సజీవ సింహాన్ని తెప్పించు" అన్నాడు. జగమిత్ర నాగాజీ అడవికి వెళ్ళాడు. అక్కడ అతడు విఠలుడిని ఆరాధించారడు. అతని ప్రార్ధన ఆలకించి విఠలుడు సింహం రూపం ధరించి ప్రత్యక్షం అయ్యాడు. నాగాజీ ఆనందభరితుడయ్యాడు. ఆ సింహాన్ని తీసుకుని యవన అధికారి ఇంటికి వెళ్ళాడు. సింహాన్ని నిజంగా చూసేసరికి యవన అధికారి లజ్జితుడయ్యాడు. నాగాజీని అతడు క్షమించమని కోరి, అతని భూమిని తిరిగి ఇచ్చేశాడు. సాధు శ్రేష్టుడైన నాగాజీ సమాధీ పరళీ వైద్యనాథ్ లోనే ఉంది.


పరళిలో అనేక మందిరాలు, ఆశ్రమాలు, సమధులు, తీర్ధాలు, పవిత్రస్థానాలు ఉన్నాయి. వాటిని గూర్చైన అనేక తఖనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాలే-సాంపలే-గోరే రామ్ గుడి, ఝింగుర్వాలే గోపినాథ్, దత్త, కాళిక, శని విఠ్ఠల, వ్యంకటేశ బాలాజీ గుడులు తొండంలేని వినాయకుడు ఒక వస్తవాదుల ఆసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఈ వినాయకుడికి దర్శనం తరువాతే వైద్యనాధుడ్ని సందర్శించాలి. వక్రేబువా, దుండిరాజ్ మహారాజ్, యమరాజ్, విశ్వేశ్వర్, గురు లింగస్వామి, వంటి అనేక మహాపురుషులు కూడా ఇక్కడ నివిసించారు. వారి పవిత్ర స్పర్శవల్ల పరళీభూమి పవిత్ర భూమిగా మారింది. మహారాష్ట్రకు ఇదొక గర్వకారణం.


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవది శ్రీ భీమశంకరుడు. క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: