పూర్వమొక రాజుగారు ప్రేమించి పెళ్లాడిన భార్యయందు ప్రేమలేక సానిసాంగత్యము చేయుచుండెను. ఆ మహారాణికి అన్ని సంపదలుండియు పెనిమిటి అనురాగములేని కారణమున చింతించుచుండగ ఒక దినమున పార్వతీదేవి ముత్తయిదువ రూపమున వచ్చి రాణీ! పూర్వజన్మమున నీవు పువ్వుల తాంబూలముల నోమునోచికొనిన వారిని చూసి పరిహసించితివి. ఆ కారణమున నీ కిప్పుడిట్టి అవస్థ కలిగినది.