మనిషి పక్షిలా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు. చేపలా నీటిలో ఈదడం నేర్చుకున్నాడు కానీ ఈభూమి మీద మనిషిలా బ్రతకటం మనిషికి చేతకాకవటం లేదు. నాగరికత పెరిగింది. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది. కాని ప్రేమతత్వం అంతగా పెంపొందడం లేదు.

ఇతర ప్రాణుల్లో ఆకాశంలోనో, నీటిలోనో ప్రయాణించటం నేర్చుకున్న మనిషి భూమిమీద ఎలా నడవాలో ఏ విధంగా ప్రవర్తించాలో యుగాలు గడిచిపోయినా నేర్చుకోలేకపోతున్నాడు. మనుషుల్లో ప్రేమానురాగాల స్థానంలో స్వార్థం, క్రూరత్వం చోటు చేసుకున్నాయి. అవి రానురాను మరింత అభివృద్ది చెందుతున్నాయి.

అంతేకాక మనుషుల్లో దైవభక్తి మరీ సన్నగిల్లిపోతుంది. దైవభక్తి ఉన్నప్పుడు ప్రేమతత్వం వర్థిల్లుతుంది. అప్పుడు ఎటువంటి అనర్థాలు జరగటానికి అవకాశం ఉండదు. మనిషి భూమిమీద ఆనందం అనుభవించాలంటే అందుకు కావలసినవి ప్రేమ, విజ్ఞానం.

కాబట్టి ప్రతి ఒక్కరూ స్వార్ధాన్ని,  క్రూరత్వాతన్ని విడానాడి వాటి  స్థానంలో ప్రేమని,  విజ్ఞానాన్ని,  వృద్ధిచేసుకుంటే జీవితాంతం ఆనందాన్ని అనుభవించగలగుతారు. వీటిని ప్రతీ మనిషి తప్పక పెంపొందించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: