ఆ గుడిలో ఏన్నో ఏళ్లుగా వింత ఆచార ముంది. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు. పూజలైనా, భగవంతునికి నైవేద్యం వండి, సమర్పించాలన్నా అంతా మగవాళ్లే చేయాలి. ఈ నియమాన్ని ఆ గ్రామస్థులు తూచా తప్పకుండా పాటిస్తారు.. అలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మకం. ఇంతకీ మగవాళ్లకు మాత్రమే ప్రవేశమున్న కడప జిల్లాలలో ఉంది. 


ఇది కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని సంజీవరాయస్వామి ఆలయం. ఇక్కడ ప్రతి సంక్రాంతి పర్వదినం ముందు వచ్చే ఆదివారం నాడు తిరుణాల జరుపుతారు. సంక్రాంతి కన్నా ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.  ఆలయంలో ఎటూ  చూసినా మగవారే కనిపించడం ఇక్కడి ప్రత్యేకత.


సంజీవరాయునికి మగవాళ్ళే పొంగళ్లు వండి.. నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారిని పూలతో అలంకరించి, ఆలయ ప్రాంగాణాన్ని మగవారే అందంగా తీర్చిదిద్దుతారు. స్వామివారికి 101 నీటి బిందెలతో ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. బెల్లం, చక్కరతో వండిన పొంగళ్ళను నైవేద్యంగా సమర్పించి తమ కోరికలను తీర్చమని కోరుకుంటారు. అనంతరం ఇంటికి పోయి ఆడవారికి ప్రసాదాలను పెడతారు. ఇలా చేస్తే తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని,  ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని తిప్పాయపల్లె వాసుల నమ్మకం. 


సంజీవరాయుని ఆలయానికి ప్రతేక చరిత్ర ఉంది. తిప్పాయపల్లె గ్రామంలోని సంజీవరాయస్వామి ఆలయం క్రీ.శే.1516లో నిర్మించబడింది. అసలు ఈ ఊరుకు ఆ పేరు ఎందుకు వచ్చింది, మగవాళ్లే సంజీవరాయునికి వండి, నైవేద్యం సమర్పించాలనే ఆనవాయితీ వెనుక పెద్దకదే ఉందంటారీ గ్రామస్థులు. 


ఈ ఆలయంలో మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. ఇక్కడ చిన్న పిల్లలు, వృద్ధులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది. ఆలయం బయట గేటు వద్ద నుంచే మహిళలు సంజీవారయున్ని దర్శించుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా.. ఈ ఆచారాని తిప్పాయపల్లె గ్రామస్తులు తప్పకుండా పాటిస్తారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: