తిరుమలవాడి సన్నిథిలో వివాహం చేసుకోవాలని చాలామంది కలలు కంటారు. కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. కానీ ఇప్పుడు వివాహం ఎక్కడ చేసుకున్నా.. కొత్త దంపతులకు ఏడుకొండలవాడి ఆశీస్సులు అందుకునే చక్కని అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. నిజంగా ఈ కార్యక్రమం నూతన దంపతులకు ఉత్తేజాన్నిస్తుంది. 


వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది తిరుమల, తిరుపతి దేవస్థానం. భక్తులు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు.. శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది. వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. 

Image result for MARRIAGE IN TIRUPATI
ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతారు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు ‘కల్యాణ సంస్కృతి’  పుస్తకాన్ని, తితిదే ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.

Image result for TTD KALYANAM
ఇందుకోసం నూతన వధూవరులు ‘కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి- 517501’ పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్‌ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని తితిదే సూచించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: