హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ  “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్నది చాలా మంది దంపతులకు తెలీదు. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడడం ఆచారం. పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు.


seeta rama kalyanam hd images కోసం చిత్ర ఫలితం


పెళ్ళీ డు వచ్చిన ఆడపిల్లలు చక్కగా చూడముచ్చటగా ఉంటారు. వివాహానికి యోగ్యమైన అమ్మాయిని చంద్రసాక్షిగా  గంధర్వుడూ,  గంధర్వసాక్షిగా అగ్ని,  ఆమెను రక్షించగా అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు. అందుకని “అగ్నిసాక్షిగా పెళ్లి ” అనే మాట వచ్చింది. 


seeta rama kalyanam hd images కోసం చిత్ర ఫలితం


వేదాలలోని ప్రధమ శబ్దం అగ్ని, ఆ అగ్నిని ఋషులు గుర్తించి అగ్రస్వరూపుని గా కీర్తించారు. ఆ ప్రధమ స్వరూపుని ఆరాధన వల్ల మనం తరిస్తాము. సృష్టిలో మనకు ఏదైనా గోచరం కావలెనంటే దానికి రూపం కావాలి. రూపమిచ్చేది అగ్ని. ‘నిరాకార జ్యోతిర్మయ బ్రహ్మం’  అగ్ని. సాకార విశ్వమూ అగ్నే. మన శరీరం లో ఉష్ణత్వం, ఈ విశ్వంలో సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని, అంటూ సమస్తం అగ్ని మయం.


agni sikha కోసం చిత్ర ఫలితం

అగ్ని సాక్షిగా వివాహం ద్వారా గ్రహిస్తాం కాబట్టే పత్నికి అంత గౌరవం ఇస్తాం: ఈ శ్లోకం పత్ని పుత్రుల గురించి చెపుతుంది.  


 “దారాధీన స్తథా స్వర్గః పిత్రూణా మా త్మన స్సహ ”


అని పెద్దలంటారు. తన పితృలందరికీ స్వర్గం లభించాలంటే, ముందు కాలంలో తానూ తరించాలంటే అది సాధ్యమయ్యేది, భార్య కనబోయే సంతానం ద్వారా కదా! అలాంటి స్వర్గానికి తీసుకుపోగలఅవకాశం బార్య ద్వారా లభిస్తుంటే ఆమెను గౌరవించాలి కదా!


beautiful indian hindu couple images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: