శనిత్రయోదశి అంటే శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.
శని త్రయోదశి
శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని , వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. 

Image result for shani pooja

శనిత్రయోదశి రోజు ఏంచేస్తే బాగుంటుంది?

1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.
2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.
3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు (నీలాంజన సమభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ: శివాయ" అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.
7. ఎవరివద్ద నుంచైనా ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోకూడదు.
8. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి.

Image result for shani pooja

శనిదోష పరిహారానికి...

- శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
- భైరవ స్తోత్రం  చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.
- శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. 
- నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image result for shani pooja

శని మహాత్మ్యం :

శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మట్లాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దొంగతనపు నింద పడి పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు కోల్పోయాడు. చివరికి, విసిగి వేసారి బాధలు భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుడి భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేశాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు, అనేక దేవతల, రుషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం మంచిది. 
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులారా చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి ఆనందం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయాడని పురాణాలు తెలుపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: