నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. కుంభ‌కోణం: తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు


ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది . ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు, ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.

 Image result for శని గ్రహ దేవాలయము

ఈ దేవాలయములో దర్శించినపుడు భక్తులు దర్భల కోసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .  ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్నా గుడి ఇదే.

 Image result for శని గ్రహ దేవాలయము

శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు . ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌.  ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: