అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వెలసియున్న తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా బ్రహ్మూెత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.

Image result for srivari brahmotsavam

 నిత్యకల్యాణచక్రవర్తికి ఏటా నిర్వహించే 450 ఉత్సవాల్లో సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలుగా బ్రహ్మూెత్సవాలు ప్రసిద్ధికెక్కాయి.
 తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భారీ ఎత్తున నిర్వహించే ఉత్సవాలివి.  బ్రహ్మోత్సవాలు కోసం ఆయా విభాగాలు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించాయి. 

Image result for srivari brahmotsavam

శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులు ఆగస్టు 1న ప్రారంభించిన విషయం విదితమే.  ప్రణాళికాబద్ధంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్‌ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటినుంచే విద్యుత్‌ అలంకరణల కోసం ప్రాథమిక పనులు చేపట్టారు.

Image result for srivari brahmotsavam

 ఉద్యానవన విభాగంలో ఆధ్వర్యంలో ఈసారి మరింత ఆకర్షణీయంగా ఫలపుష్ప ప్రదర్శన, ఇతర పుష్పాలంకరణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఫలపుష్ప ప్రదర్శనలో ఏర్పాటుచేసే వివిధ సెట్టింగులకు సంబంధించి పౌరాణిక అంశాలను ఖరారు చేస్తున్నారు.

Image result for శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు

ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు నిర్వహించేందుకు టిటిడి సమాయత్తం అవుతోంది.

Image result for శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు

 సెప్టెంబరు 23న ధ్వజారోహణం, సెప్టెంబరు 27న గరుడోత్సవం,సెప్టెంబరు 28న స్వర్ణరథం,  సెప్టెంబరు 30న రథోత్సవం 
అక్టోబరు 1న చక్రస్నానం ధ్వజావరోహణం జరుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: