రాజ్యము - శ్రీరామ రాజ్యము
రాజు - కులశేఖర పెరుమాళ్
దివ్యదేశము - శ్రీరంగము
తిరునామము - శ్రీవైష్ణవులు
నివాసము - శ్రీపరాంకుశ నిలయము
కుటుంబము - శ్రీరామానుజగోష్ఠి
పరివారము - రామానుజ దాసులు
నిర్వహణ - కోయిల్ పెరియ జీయర్
ఇంటిపేరు - తెన్నాచార్య
తల్లి - శ్రీరంగనాయకి 
తండ్రి - శ్రీరంగనాథుడు
జ్యేష్టులు - ఆళ్వారులు, పూర్వాచార్యులు
కూటమి - ప్రపన్నకులము
కులభూషణం - ఆచార్యరత్నాహారము
అర్హత - పంచసంస్కారములు
అక్షరాభ్యాసము - అర్ధపంచకజ్ఞానము
వంశము - లక్ష్మీనారాయణ
గోత్రం - నాథముని
భాష - దాస భాష
ఘనత - ప్రధమ, చరమపర్వనిష్ఠ
రూపము - పరమవిలక్షణము
స్వరూపము - భగవత్ శేషత్త్వము
ఉద్దేశ్యము - భాగవత శేషత్త్వము
వృత్తి - భగవత్ కైంకర్యము
ప్రవృత్తి - భాగవత కైంకర్యము
సంపాదన - ఆచార్యాభిమానము
స్వభావము - పరతత్త్వనిష్ఠ, ప్రపత్తినిష్ఠ
విద్య - భగవద్విషయము
మతము - ప్రపత్తి సంప్రదాయము
అభిమతము - మంగళాశాసనము
నైజము - దివ్యదేశ సంచారము
వ్యవహారము - పరమ సాత్త్వికము
సంపద - జ్ఞానము, అనుష్ఠానము
బంధుజనము - ఆత్మబంధువులు
బాలభోగము - ఆళ్వారుల శ్రీసూక్తులు
రాజభోగము - ఉడయవరుల శ్రీసూక్తులు
శయనభోగము - వరవరమునుల శ్రీసూక్తులు
ధారకము - ఆండాళ్ శ్రీసూక్తులు
కాలక్షేపము - భగవద్గుణానుభవము
పండుగలు - ఆళ్వారాచార్య తిరునక్షత్రములు
విద్యాలయము - యదుశైలము
కోవెల - మనస్సు
దైవము - శ్రీభగవద్రామానుజులు
ఆభరణములు - ఆత్మగుణములు
సిద్ధాంతము - యెమ్బెరుమానార్ దర్శనము
యాగము - తిరువారాధన
యజ్ఞము - తదీయారాధన
శ్వాస - దివ్యప్రబంధ సంకీర్తనము
శిరోధార్యము - రామానుజుల దివ్యాజ్ఞ
శిరోభూషణము - శ్రీశఠారి
మనోభూషణము - ముదలియాణ్డాన్
అభిలాష - తిరువడిసేవ
పురుషార్ధము - నిత్యకైంకర్యము
యోగ్యతలు - వినయము, వైరాగ్యము
అసహ్యము - దేవతాంతరభజన
భయము - విషయాంతరములు
నిషేధము - ఉపాయాంతరములు
నిరపేక్ష - దేహాభిమానము
నిరాకరణ - ఉపాసనా మార్గము
విరోధి - భాగవతాపచారము
బిరుదులు - భాగవతోత్తములు, ప్రపన్నులు
శైలి - చకోరపక్షుల శైలి
వ్రతము - ధర్మాచరణ
దీక్ష - శరణాగతి దీక్ష
రక్షకము - సుదర్శన పాంచజన్యములు
ధారణము - తులసీ ఊర్ధ్వపుండ్రములు 
పవిత్రము - భగవదాచార్య శేషమాలలు
ఔషధము - భాగవత శ్రీపాదతీర్ధము
ఆయుధము - శ్రీభాష్యము
భాగ్యము - భాగవత శేషప్రసాదము
విశేషగుణము - భూతదయ
విశేషలక్షణము - నైచ్యానుసంధానము 
మిత్రులు - శ్రీవైకుంఠపురవాసులు
విధి - లోక కళ్యాణము
శ్రీవైష్ణవులకు జయీభవ! విజయీభవ!
శ్రీవైష్ణవకులము వర్ధతాం! అభివర్ధతాం!!


మరింత సమాచారం తెలుసుకోండి: