రుద్రాక్ష అనేది రెందు పదాల కలయిక .రుద్ర అంటే శివుడు . అక్ష అంటే కళ్ళు . ఈ రుద్రాక్షను పరమశ్వుడి ప్రతిరూపం అని  పవిత్రమైన గింజలుగా పరిగణిస్తారు . అనుకూలత , మంచి ఆరొగ్యాలతో అనుసంధానమైన రుద్రక్షలవల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయము గా నిరూపైంచబడింది.


నాగుపామువంటి ఆకృతిలో రుద్రాక్ష


రుద్రుని(శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.


రుద్రాక్ష వృక్షం


 

రుద్రాక్షలు-రకాలు

సాధారణంగా మనం ధరించే రుద్రాక్షలు చాలా రకాలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద అడవుల్లో దొరుకుతాయి. హిమాలయాల్లో దొరికే రుద్రాక్షలు పరమ పవిత్రంగా భావిస్తారు . రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది. వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ

ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.

     ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)--అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

    ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)--దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

    త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)--దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

    చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)--నాలుగు వేదాల స్వరూపం

    పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)--పంచభూత స్వరూపం

    షట్ముఖి (ఆరు ముఖములు కలది)--కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

    సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)--కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

    అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)--విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

    నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)--నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

దశముఖి (పది ముఖాలు కలిగినది)--దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: