క్రికెట్ రంగంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్  గా మిచెల్ జాన్సన్ బాగా ఫేమస్ అయ్యారు. ప్రత్యర్థులతో తన బౌలింగ్ ఒక్క ఆట ఆడేవాడు. గతవారం అన్ని ఫార్మాట్‌ల నుంచి  మిచెల్ జాన్సన్  వైదొలగిన సంగతి తెలిసిందే.  గాయాల బారిన పడకుండా.. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలోనే జాన్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం విశేషం.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు అనంతరం మిచెల్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నిప్రకటించాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్  లు మిచెల్ మళ్లీ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జాన్సన్ రిటైర్మెంట్‌పై లీమన్ మాట్లాడుతూ.. మేమిద్దరం క్రికెట్ ఆడాలి రమ్మని పిలిపిస్తే.. ఆడను ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తానంటున్నాడని చమత్కరించాడు. జాన్సన్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా పేస్ విభాగం కొంత బలహీనపడిందని, మిచెల్ స్టార్క్ రాణిస్తున్నప్పటికీ సిడెల్, పాటిన్సన్, హేజిల్ వుడ్ తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

మిచెల్ జాన్సన్ 


ప్రస్తుతం ఆసీస్ జట్టులో పేస్ బౌలింగ్ లేమి కనబడుతోందని దాన్నిభర్తీ చేయడానికైనా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా జాన్సన్ ను లీమన్, స్మిత్ లు కోరారు. కనీసం వన్డేల్లోనైనా  ఆడాలని మిచెల్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. 'మిచెల్ తిరిగి ఆడితే బాగుంటుంది. కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఆసీస్ మ్యాచ్ లను చూడాలని అనుకుంటున్నాడు' అని లీమన్, స్మిత్ లు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: