టీమీండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ గురించి తెలియనివారు ఉండరు..బెంగాల్ టైగర్ గా తన బ్యాట్ తో మెరుపులు మెరిపించిన క్రీడాకారుడు. తాజాగా టీమిండియా కోచ్‌ బాధ్యతలను గురించి మాట్లాడుతూ..ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆ అవకాశం ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగం ఇచ్చినా చేయలేను.

ఎందుకంటే క్యాబ్ అధ్యక్షుడిగా క్రికెట్‌ను నడిపిస్తున్నా. కాబట్టి ఒకేసారి రెండు పనులను చేయడం సాధ్యం కాదు. భవిష్యతలో బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడం గురించి మాట్లాడుతూ.. ఇప్పుడే కెరీర్‌ మెదలెట్టాను. ఎక్కడికి చేరుకుంటానో తెలియదని సౌరవ్‌ చెప్పాడు. ప్రస్తుతానికి తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడమే తన విధి అని గంగూలీ తెలిపాడు.

విమర్శలకు బదులివ్వడంలో ఎంతో పరిణతి సాధించాడని దాదా అన్నాడు. ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండడాన్ని ధోనీ అలవర్చుకున్నాడని చెప్పాడు. సారథిగా విమర్శలతోపాటు విజయాలు సాధించినప్పుడు ఆకాశానికెత్తేసిన పొగడ్తలు కూడా ధోనీకి సుపరిచితమేనని సౌరవ్‌ అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: