ఐపిఎల్ 9వ సీజన్లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ లయన్స్ తమ సత్తా చాటుతున్నారు. జట్టు కొత్తదే అయినా ఆటగాళ్లు పాతవాళ్లే అయ్యేసరికి జట్టుకి వరుసగా మూడో విజయాన్ని అందించి ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది గుజరాత్.


ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మొదటి బంతి నుండే తడబడటం స్టార్ట్ చేసింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్(34) కాస్త మెరుగైన ఆట ప్రదర్శించినా మిగతా ఆటగాళ్లలో బట్లర్(16),అంబటి రాయుడు(20),టిమ్ సౌతీ(25), కృణాల్ పాండ్యా(20 నాటౌట్)లు అత్యల్ప స్కోర్ కే వెనుతిరగడంతో జట్టుకి నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. 


ఇక గెలుపు బరిలో 144 పరుగుల లక్ష్యంతో దిగిన గుజరాత్ ముందు నుండి దూకుడు ప్రదర్శించి మ్యాచ్ పై నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇక గుజరాత్ లయన్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (67; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. లాస్ట్ ఒక్క బాల్ కు ఒక పరుగు చేయాల్సి ఉండగా ఫోర్ కొట్టి గుజరాత్ కు విజయాన్ని అందించారు.


ముంబై బౌలర్లలో మెక్ క్లెనగన్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా రెండు వికెట్లు, పాండ్యా ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో చివరిదాకా ఉత్కంఠ ఏర్పడింది అని చెప్పాలి. కొద్ది సేపు ముంబై తమ బౌలింగ్ ప్రదర్శనతో గుజరాత్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తే మరికొద్ది సేపు లయన్స్ తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించారు. ఎట్టకేలకు మ్యాచ్ చివరి బంతిదాకా నిలిచి సగర్వ విజయాన్ని అందుకున్నారు గుజరాత్ లయన్స్. ఈ విన్నింగ్ తో వరుసగా మూడు మ్యాచ్ లో విన్ అయిన గుజరాత్ గెలుపు ధీమాతో ముందుకుసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: