ఈసారి వన్ సైడ్ మ్యాచ్ లే అనుకున్న జట్లన్ని సంచలన విజయాలు దక్కించుకోవడం స్టేడియంలో ఉన్న అభిమానులకే కాదు టివిల ముందు ఉన్న క్రికెట్ అభిమానులకు కూడా మంచి ఉత్సాహాన్ని తెస్తుంది. మ్యాచ్ ఏదైనా ఐపిఎల్ అంటే అదో క్రేజ్.. ఇక నిన్న జరిగిన రాయల్ చాలెంజ్ బెంగుళూరు వర్సెస్ ఢిలీ డేర్ డెవిల్స్ మ్యాచ్ అంతా ఒక్క సైడ్ విన్నింగ్ అనుకున్నారు.


అయితే దీనికి కారణం ఆర్.సి.బిలో కొహ్లి వీరోచిత బ్యూటింగ్ నైపుణ్యం చూపిస్తుంటే అతనికి డివిలియర్స్ తోడుగా నిలుస్తున్నాడు. మరో పక్క క్రిస్ గేల్ ఎప్పుడు విజృంభిస్తాడో తెలియదు.. ఇలాంటీ క్వాలిటీస్ ఉన్న బెంగుళూర్ టీం ఢిల్లీ జట్టుపై విజయం సాదించడం గ్యారెంటీ అనుకున్నారంతా.. కాని ఐపిఎల్ అనుకున్నది జరుగదు అనేది మరోసారి ప్రూవ్ చేసింది.  


ముందు బ్యాటింగ్ చేసిన బెంగుళూరు టీం 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. కొహ్లి 49 బంతుల్లో 79 మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇక 120 బంతుల్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ మొదటినుండి ఫైర్ మీదుంది. ఢిల్లీ ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుత బ్యాటింగ్ తో బెంగుళూరుకి చుక్కలు చూపించాడు. 51 బంతుల్లో సెంచరీ (108) కొట్టగా మరో బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ (54 నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) గా మంచి ప్రదర్శన ఇచ్చారు. 


మరో 5 బంతులుండానే మ్యాచ్ ను ముగించింది అంటే ఢిల్లీ ఎంత డేరింగ్ గా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీ బ్యాటింగ్ కు ముందు చేజింగ్ కష్టమే అనుకున్న వారికి డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ తమ సత్తా చాటి పోటీలో తాము ఉన్నట్టు గురుచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: