ఈ ఐపిఎల్ లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోల్ కతా తమ పట్టు విడిచేలా కనబడట్లేదు. దూకుడు ఆటను ప్రదర్శిస్తూ వరుస విజయాలను దక్కించుకుంటున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆటగాళ్లను చిత్తు చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యింది.


పంజాబ్ జట్టు షాన్ మార్ష్(56 నాటౌట్;41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోర్ అన్నా వచ్చింది. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ మంచి ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ తో జట్టుకు విజయాన్ని అందించడంలో సహకరించారు. ఉతప్ప(53 పరుగులు; 28 బంతుల్లో 9 ఫోర్లు), గౌతం గంభీర్ (34 పరుగులు; 34 బంతుల్లో 3 ఫోర్లు)గా స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. 


చివర్లో వికెట్లు కోల్పోయినా యాదవ్, యూసఫ్ పఠాన్ లు మిగిలున్న రన్స్ ను చేధించి జట్టుకి విజయాన్ని అందించారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, మోర్నీ మోర్కెల్లకు తలో రెండు వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్లకు చెరో వికెట్ తీసి పంజాబ్ జట్టు అత్యల్ప స్కోర్ మాత్రమే చేసేలా కట్టడి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: