ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ జట్టు చూస్తుంటే ఈసారి కప్ కైవసం చేసుకునేలానే ఉంది. ఐపిఎల్ 9వ సీజన్ లో సన్ రైజర్స్ శనివారం పంజాబ్ జట్టుని ఓడించింది. మరోసారి చేజింగ్ లో సన్ రైజర్స్ హవా కొనసాగించింది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.


ఐపిఎల్ 9వ సీజన్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ ను ఫీల్డింగ్ కు ఆహ్వానించిన సన్ రైజర్స్ కేవలం 143 పరుగులకే కట్టుదిట్టం చేశారు. ముస్తఫిజుర్ అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ ఆటగాళ్లు బెంబేలెత్తేలా చేశాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసిన ముస్తఫిజుర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.  


టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (34 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తొ జట్టుని కాపాడగా చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి ఆమోదయోగ్యమైన స్కోర్ ను అందించారు. ఇక మెరుపు వేగంతో గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్ ముందునుండి ఎటాకింగ్ తో ఆడారు.  


ఫాంలోకి వచ్చిన థావన్ చెలరేగుతుంటే మరో పక్క వార్నర్ మరోసారి తన ప్రతాపం చూపించాడు. పరుగుల వేగంతో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన వార్నర్ భారీ షాట్ కు ఆడి పెవిలియన్ బాట పట్టాడు. తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు చేసిన సన్ రైజర్ హైదరాబాద్ ఆ తర్వాత మిగిలిన పరుగులు సునాయాసంగా సాధించింది. చివర్లో మోర్గాన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయాన్ని అందించేలా చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: