కెట్ లో అత్యంత ప్రావీణ్యం ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క కప్ కూడా లేని దేశం దక్షిణాఫ్రికా. టీం మొత్తం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఆఖరి వరకూ ఒచ్చినా మొత్తం కుదేలయ్యి ఆఖరి క్షణాల్లో అవతలి టీం కి కప్పు ని ధారపోయడం దక్షిణాఫ్రికన్ లకి బాగా అలవాటు. అందుకే వాళ్ళని " చోకర్స్ " అనే పేరుతో గేలి చేస్తూ ఉంటారు కూడా. మొన్నటి t 20 వరల్డ్ కప్ లో కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోయినా ప్రొతెస్ కి ఇప్పుడు సరికొత్త సమస్య ఒచ్చి పడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా లో ఎక్కడ క్రికెట్ ఆడడానికి అనుమతి లేదు.  ఆ దేశంలో ఏడాది పాటు క్రికెట్.. రగ్బీ అంతర్జాతీయ మ్యాచులేవీ నిర్వహించకుండా నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ రెండు క్రీడల్లో జాతి వివక్ష నడుస్తుండటమే ఈ నిర్ణయానికి కారణం.



తెల్ల జాతీయులకే ఈ రెండు ఆటల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ఆ దేశం లో ఎలాంటి టోర్నమెంట్ లూ మేజర్ మ్యాచ్ లూ జరగకుండా వారు నిషేధం విధించారు. దక్షిణాఫ్రికా క్రికెట్ లో జాతి వివక్ష ఉంది అనే ఆరోపణలు ఎన్నో దశాబ్దాల నుంచీ సాగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ కి దూరమై 92 లో మళ్ళీ దక్షిణాఫ్రికా వెనక్కి ఒచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు లో తెల్ల జాతీయులదే ఆధిపత్యం. అసలు జట్టులో నల్ల జాతీయులు ఎక్కడా కనపడరు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: