ఐపిఎల్ 9వ సీజన్లో అన్ని జట్లు తమ అత్యున్నంత నైపుణ్యతను ప్రదర్శిస్తూ పోటీ రసవత్తరంగా మార్చుతున్నారు. ఇక లీగ్ దశలోనే ఓ రేంజ్లో నువ్వా నేనా అన్నట్టుగా గెలుపు చివరి దాకా వచ్చి ఓడిపోతున్నారు. శుక్రవారం జరిగిన పూణె, గుజరాత్ మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠతో సాగింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా తడబడినా గుజరాత్ లయన్స్ విజయ దుంధుంభి మోగించింది.


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పూణె నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.. 54 బంతుల్లో 8 ఫోర్లు 5 సికర్స్ తో 101 కొట్టి జట్టుకి మంచి స్కోర్ వచ్చేలా చేశాడు. రహానే 45 బంతుల్లో 53 మంచి నైపుణ్యం ప్రదర్శించాడు. ఇక డేరింగ్ అండ్ డ్యాషింగ్ ధోని కూడా ఈ మ్యాచ్ లో విజృంభించి ఆడాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో ధోని 30 నాటౌట్ గా నిలిచాడు.


ఇక 196 పరుగుల గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ ముందు నుండి దూకుడు ఆటను ఆడింది. మెక్ కలం మొదటి ఓవర్ నుండే విధ్వంసం సృష్టించాడు. తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం రాబట్టిన గుజరాత్ లయన్స్ మొదటి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. 


కెప్టెన్ రైనా 28 బంతుల్లో 34 మంచి సపోర్ట్ ఇవ్వగా.. దినేశ్ కార్తీక్ 20 బంతుల్లో 33 జట్టుకి అవసరమైన స్కోర్ ఇవ్వడంలో సహకరించాడు. ఇక చివరిలో 12 బంతుల్లో 20 పరుగులు అవసరముండగా గుజరాత్ ఆటగాళ్లు వికెట్లు కోల్పోయినా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులను చేసింది. ఈ విజయంతో లీగ్ దశలో గుజరాత్ 6 విజయాలను సొంతం చేసుకుని ముందంజలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: