అనుకున్నట్టుగానే ఐపిఎల్ సీజన్ 9లో అన్ని జట్లు తమ అత్యున్నత ప్రదర్శనతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సీజన్లో ప్రత్యర్ధులను ముచ్చెమటలు పట్టిస్తున్న జట్టు కోల్ కతా నైట్ రైడర్స్.. ఐపిఎల్-9 సీజన్ లో 9 మ్యాచ్ లకు గాను 6 మ్యాచ్ లను విజయ దుందుంభి మోగించి తమ సత్తాచాటుకున్న కోల్ కతా ఆటగాళ్లను ఆ టీం కోచ్ జాక్వస్ కలిస్ హెచ్చరికలు జారి చేశాడు.


విజయాలను చూసి మురిసిపోకుండా మరింత పోరాట ప్రతిమతో మ్యాచ్ లన్ని నెగ్గాలని.. 2015 లో కూడా మొదట విజయ ఢంఖా మోగించిన కోల్ కతా తర్వాత చతికిల పడ్డ విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ఐపిఎల్-8వ సీజన్లో అప్పటిదాకా విజృంభించి ఆడిన కోల్ కతా ఆటగాళ్లు ఆ తర్వాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయారు.


అంతేకాదు ఆ సీజన్లో ప్లే అప్ బెర్త్ ను కూడా కోల్పోయింది కోల్ కతా. అయితే ఈసారి మాత్రం జట్టు మంచి హుశారుగా ఉంది. 2015లో జరిగిన దానికి ప్రతికారంగా ఈసారి ఫైనల్ కు చేరేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పట్టికలో ప్రధమ స్థానంలో ఉన్న కోల్ కతా రన్ రేట్ లో కూడా మంచి పటుత్వంతో ఉంది.


మరి కలిస్ చెప్పిన మాటలను విని రాబోయే మ్యాచుల్లో కూడా ఇప్పటిదాకా ఆడిన పోరాట ప్రతిభను చూపిస్తారో లేదా 2015 సెంటిమెంట్ ను మళ్లీ రిపీట్ చేస్తారో అన్నది కోల్ కతా ఆటగాళ్ల మీద ఉంది. జట్టు సారధి గంభీర్ మాత్రం ఈసారి కప్పు వదిలే ప్రసక్తే లేదు అన్న పట్టు మీదున్నాడు. మరి చివరకు ఏమౌతుందో ఏమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: