ఐపిఎల్ సీజన్లో బెంగుళూరు మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై తో తలపడ్డ బెంగుళూరు పేలవమైన ప్రదర్శనతో ఓటమి చవిచూసింది. టాస్ ఓడి ఫీల్డింగ్ కు దిగిన బెంగుళూరు నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన రోహిత్ సేన 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.


బెంగుళూరు రాయల్ చాలెంజ్ ఆటగాళ్లు కొహ్లి కేవలం 7 పరుగులకే అవుటవ్వగా.. క్రిస్ గేల్ 5 పరుగులకే నిష్క్రమించాడు. ఇక జట్టు కు ఆమాత్రం స్కోర్ వచ్చింది అంటే ఏబి డివిలియర్స్ 24, రాహుల్ 68 నాటౌట్ గా నిలవబట్టే వచ్చింది. చివర్లో సచిన బేబి 13 బంతుల్లో 25 పరుగులు చేసి బెంగుళూరు జట్టుకు 151 పరుగులను సాదించి పెట్టాయి.


ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు చేయగా.. అంబటి రాయుడు 44, పొలార్డ్ 35 ప్రుగులతో ముంబై జట్టు విజయాన్ని అందుకునేలా చేశారు. 18.4 ఓవర్లలోనే 152 పరుగులను సాధించిన ముంబై జట్టు అప్పటికి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇక ఈ విజయంతో పట్టికలో నాలుగో స్థానంలో స్థానం సంపాదించింది ముంబై జట్టు.


ముంబై జట్టులో అద్భుతమైన బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన కుణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు. ఇక ఈ పరాజయంతో బెంగుళూరు మరింత కష్టాల్లో పడ్డదని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: