ఐపిఎల్ సీజన్లో అన్ని అద్భుతమైన మ్యాచ్ లే అని చెప్పాలి. ప్లే ఆఫ్ మొదటి మ్యాచ్ లో బెంగుళూరు, గుజరాత్ మ్యాచ్ లో డివిలియర్స్ అద్భుతమైన ఆట బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు బ్యాటింగ్లో తడబడింది. ఇక బెంగుళూరు బౌలర్లు గుజరాత్ బ్యాట్స్ మన్ పై తమ వీరంగ ప్రదర్శించారు.


అద్భుత ఓపెనింగ్ ఇస్తారనుకున్న ఫిచ్, మెక్కల్లం కేవలం సింగిల్ డిజిట్ పరుగులకే త్వరగా పెవిలియన్ బాట పట్టగా కార్తిక్ 26 జట్టుని ఆదుకున్నాడు. ఇక ఒంటి చేత్తో స్మిత్ 73 పరుగులు చేయగా జట్టుకు ఆమాత్రం స్కోర్ అన్నా వచ్చింది. 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ లయన్స్ 158 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  


ఇక నిర్ణీత ఓవర్లలో 159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగుళూరు జట్టు ఊహించని పరిణామాల్లో గేల్, కొహ్లి అవుట్ అయ్యారు. ఇక జట్టు విజయాన్ని తన భుజ స్కందాల మీద వేసుకున్న డివిలియర్స్ అద్భుత ఇన్నింగ్స్ తో అజేయంగా బెంగుళూరుకి విజయాన్ని అందిచాడు. ఓ పక్క జోరు కొనసాగిస్తూనే తను వికెట్ పోతే కష్టమని గ్రహించి మెరుగైన ఆటను ప్రదర్శించాడు డివిలియర్స్.


ఈ విజయంతో బెంగుళూరు జట్టు ఐపిఎల్ 9వ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈరోజు మరో ప్లే ఆఫ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ రెడీ అవుతున్నారు. ఎవరువిజయం సాదిస్తారో వారు బెంగుళూరు మీద ఫైనల్స్ ఆడటం జరుగుతుంది. మరి చివరి దశకు చేరుకున్న ఐపిఎల్ సీజన్లో మరెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: