భారత జాతీయ క్రీడ అయిన కబడ్డీ ఆట ప్రతి ఏడాది తన ప్రదర్శనను మేరుగుపర్చుకుంటూ ప్రేక్షక మహాశయుల విశేష ఆదరాభిమానాలు పొందుతుందనదమలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటలు జరిగినా అప్పుడు ప్రేక్షకుల హృదయాలను గెల్చుకోలేక పోయింది. దీనికి కారణాలు ఏమైనా, గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆటపై మీడియా ప్రత్యేక దృష్టి సారించడంతో పలు చానెళ్లు పలు భాషల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించాయి. దీంతో కబడ్డీ జాతీయ స్థాయిలో ప్రేక్షక హృదయాలను గెల్చుకోవడంలో విజయం సాధించింది. 



గ్రామీణ క్రీడ నుంచి గ్లామర్ జెమ్ గా చాలా కొద్ది కాలంలోనే కబడ్డీ రూపాంతరం చెందింది. ఐపీఎల్ తో సరిసమానంగా రూపాంతరం పొందుతూ, పట్టణ, నగర్,గ్రామ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇటీవలే ఐపీఎల్- 9 పేరిట జరిగిన పొట్టి క్రికెట్ పండుగ క్రికెట్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఏటా ప్రేక్షకుల సంఖ్యను లక్షల కొలది పెంచేసుకుంటూ వెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. 



గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి దేశంలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ పలువురు క్రీడారంగ ప్రముఖులతో కలిసి ప్రారంభించిన ప్రొ కబడ్డీ లీగ్ కు ఏటా ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే మూడేళ్ల పాటు దేశీయ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఈ లీగ్ తన నాలుగో సీజన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంది. పుణే వేదికగా తెలుగు టైటాన్స్, ఫుణెరి పల్టన్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ తో ప్రొ కబడ్డీ లీగ్-4 సీజన్ ప్రారంభం కానుంది.  రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. అలాగే రాత్రి 9 గంటలకు యుముంబా తో జైపూర్ తలపడనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: