సెలెబ్రిటీల కీ - టీవీ ఛానల్ న్యూస్ రీడర్ లకీ ఎప్పటికప్పుడు హాట్ హాట్ డిస్కషన్ లు సాగుతూనే ఉంటాయి. సినిమా తారల తోనో , పొలిటీషియన్ లతోనో, స్పోర్ట్స్ పెర్సోనాలిటీ ల తోనో వాదనలు చెయ్యడం ఇది లైవ్ లో టెలికాస్ట్ చెయ్యడం పెద్ద కొత్తేమీ కాదు వీరికి. అర్నబ్ గోస్వామి, రాజదీప్ సర్దేశాయ్ , భార్క దత్ లాంటి వారికి ఇది దిన చర్య. తాజాగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా తన ఆత్మకథ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లు ఇస్తూ దేశం లోనే సీనియర్ జర్నలిస్ట్ లలో ఒకరు అయిన రాజదీప్ సర్దేశాయ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 " ఎంతో సాధించారు కదా ఇంక నెక్స్ట్ ప్లాన్ ఏంటి ? ఎప్పుడు తల్లి కాబోతున్నారు , దానికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లో ఉన్నారు " అని మామూలుగానే రాజదీప్ సర్దేశాయ్ సానియా మిర్జా ని అడిగారు. ఆ మాట వినగానే ఆమె కోపం తో ఊగిపోయింది. తల్లి అవ్వడం పెద్ద తప్పు అయినట్టు మాట్లాడుతున్నారే అంటూ ఆయనకి క్లాస్ పీకింది ఆమె. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో గానీ సారీ చెప్పేసాడు పెద్దాయన కూడా. సానియా తన క్రీడా ప్రస్థానంపై ‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’ పేరిట ఆమె రాసుకున్న పుస్తకాన్ని హైదరాబాద్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు.

 

ఈ పుస్తక ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. అందులో భాగంగా రాజ్ దీప్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కెరీర్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు కాస్త కోపం తెచ్చుకుంది. అప్పటికీ బానే సమాధానం చెప్పింది. కానీ తల్లి ఎప్పుడు అవుదాం అనుకుంటున్నరు అన్న ప్రశ్న వచ్చే సరికి ఆమె సీరియస్ అయిపొయింది.  తల్లి అవడం ఎదో తప్పు అన్నట్టు గా . " ఆడవారి తో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఎదురు అవుతాయి. పెళ్లి చేసుకోవడమో, పిల్లల్ని కనడమో సెట్టిల్మేంట్ కింద ఫీల్ అవుతారు మీరందరూ. పురుష క్రీడాకారుడికి ఇలాంటిది ఎదురు అవ్వవ్వు" అని ఆమె సీరియస్ ఐపోయింది. దాంతో షాక్ అయిన రాజ్ దీప్ హుందాగా నే సమాధానం చెప్పాడు. ‘మీకు వేసిన ప్రశ్నలను నేను ఇప్పటిదాకా ఏ పురుష క్రీడాకారుడికి వేయలేదు. తప్పు చేశాను. మన్నించండి” అంటూ హుందాగా క్షమాపణ కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: