తెలుగు తేజం పీ వీ సింధు కు తెలంగాణ సర్కార్ ఘన స్వాగతం ప‌లికింది. పీవీ సింధుకు పుష్ప‌గుచ్చాన్ని ఇచ్చి ఘ‌న స్వాగతం పలికారు. ఎల్ల‌లుదాటిన ఆనందంతో సింధుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికింది.  కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం మ‌హ్మ‌ముద్ అలి, హోంమంత్రి నాయిని న‌ర్సింహ్మ రెడ్డి, మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి,  న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ జ‌నార్ద‌న్ రెడ్డి,   టీ స‌ర్కార్ నుంచి మంత్రి కేటీఆర్ ద‌గ్గరుండి స్వాగ‌త కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ ఏర్పాట్లే చేశారు. క‌టౌట్లు, బ్యాన‌ర్లతో హంగామా నెల‌కొంది. ఈ మేర‌కు పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

టీ. సర్కార్ భారీ ఏర్పాట్లు....

ఉద‌యం 8నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు , పీవీఎన్ ఆర్ అండ‌ర్ వే, అత్తాపూర్ , టోలిచౌకీ. ద‌ర్గా, ఖాజాగూడ మీదుగా గ‌చ్చిబౌలి లోని జీఎంసీ రోడ్డ నెంబ‌ర్ -36 ,100 పీట్ల రోడ్డు సైబ‌ర్ ట‌వ‌ర్స్, కొత్త గూడ‌, బొటానిక‌ల్ గార్డెన్, మ‌సీద్ బండా,ఓల్డ్ బోంబాయి హైవే ను వినియోగించుకోవాల‌న్నారు. స్టేడియం లో ప్ర‌ధాన వేదిక , ప్ర‌ముఖ‌లు కూర్చునే గ్యాల‌రీ వ‌ద్ద పటిష్ట భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం లోప‌ల‌, బ‌య‌డ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టేడియం వైపు వ‌చ్చే ప్రధాన ర‌హ‌దారి తో పాటు అథ్లేటిక్ స్టేడియంలోనికి వెళ్లేందుకు అందుబాటు లో ఉన్న 8 దారులును పోలీసులు త‌మ ఆధీనం లోకి తీసుకున్నారు. పోలీస్ క‌మిష‌న‌ర్ న‌వీన్ చంద్, జాయింట్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర , మాదాపూర్ డీసీపీ కార్తికేయ , కుక‌ట్ ప‌ల్లి ఏసీపీప భుజంగ రావు లు బందో బ‌స్తు ఏర్పాట్లు చేశారుజ‌

గౌచ్చిబౌలిలో సింధు కు సన్మానం...

ఉయ‌దం 9:20 ల‌కు ఏయిర్ పోర్టు కు చేరుకున్న సింధు తో వీవీఐపీ ల‌కు మ‌ర్యాద‌పూర్వ‌క పరిచ‌యం. మీడియా ఫోటో చిత్రీక‌ర‌ణ జరిగింది. అనంత‌రం సింధుకు.. స‌హ‌చ‌ర బ్యాడ్మింట‌న్ క్రీడాకారులు అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు శంఫాబాద్ విమానాశ్ర‌యం నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం కు ర్యాలీ గా సింధు తీసుకెళ్ల‌నున్నారు.అనంత‌రం ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య ప‌తాకం ఎగువేస్తారు... పోలీసుల గౌర‌వ వంద‌నం తో దేశ భ‌క్తి గీతాలాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం శాలువాలు, పుష్పాగుచ్చాలు, మెమోంటోల‌తో స‌త్కారం, రివార్డుల చెక్కుల అంద‌జేయ‌నున్నారు. ఆ త‌రువాత మంత్రి కేటీఆర్, సింధు గెలుపును ఉద్దేశించి ప్ర‌సగించ‌నున్నారు. అటు పిమటు సింధు కోచ్ పి. గొపీ చంద్ ప్ర‌సంగం ఉంటుంది. అనంత‌రం పీవీ సింధు ప్ర‌సంగం చేయ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: