రియో ఒలింపిక్స్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆనందానికి అవధుల్లేవు. రియో ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించిన బోల్ట్, తాను అనుకున్న ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధించడంతో మరింత ఆనందంగా ఉన్నాడు. వీటన్నింటికీ తోడు నిన్న తన 30వ పుట్టినరోజు జరుపుకున్న బోల్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. హ్యాపీగా డ్యాన్స్ చేశాడు. ప్రపంచ స్టార్ స్ప్రింటర్గా బోల్ట్ సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. 


బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు

ట్రాక్పై చిరుతలా పరుగెత్తే బోల్ట్ అమ్మాయిల విషయంలోనూ చాలా ఫాస్టే. జమైకాకు చెందిన గాళ్ఫ్రెండ్ కాసి బెనెట్తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. ఇందుకు సాక్ష్యం డ్యురేట్ తన వాట్సప్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటోలే. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారాయి. బోల్ట్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం. కాగా, బోల్ట్ తో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై డ్యురేట్ స్పందిస్తూ,



 బోల్ట్ ఎవరో తనకు తెలియదని, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే అతను బోల్ట్ అని తెలిసిందని చెప్పింది. వాట్సాప్ లో షేర్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడం తనకు చాలా సిగ్గుగా ఉందని చెప్పింది. ఈ విషయంపై బోల్ట్ స్పందిస్తూ ఒక సెలబ్రిటీగా ఒకే మహిళతో కలిసి ఉండటం చాలా కష్టమని అన్నాడు. ఈ విషయాన్ని తాను చాలా తేలికగా తీసుకుంటున్నానని, జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని చెప్పాడు. మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములుంటారని బోల్ట్ చెప్పు కొచ్చాడు. కాగా, బోల్ట్ విషయమై ఆయన సోదరి మాట్లాడుతూ, జమైకాకు చెందిన కాసి బెనెట్ తో బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని చెప్పారు. రెండేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, ఆ అమ్మాయినే తన సోదరుడు వివాహం చేసుకుంటాడని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: