ఇది ఓ పదకొండు స్మవత్సరాల కుర్రాడు సాదించిన అరుదైన ఘనత. భువనేశ్వర్ లోని సబర్ షాహీ వద్ద మురికివాడలో నివసిస్తున్న చందన్ నాయక్ ఇప్పుడు జర్మనీలో ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ లో శిక్షణ పొందేందుకు అర్హత సంపాదించాడు. జర్మనీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ బాయెర్న్ మ్యూనిక్ లో చందన్ నాయక్ రెండు నెలలు శిక్షణ పొందేందుకు అర్హత సాధిచాడు. ఇక ఈ కుద్దాడి కల భారత్ తరపున ఫుట్ బాల్ ఆడటమే.


ఇక అతని యూక్క దూకుడుతనతో పాటు అతని పట్టుదలని కొనియాడారు చందన్ కోచ్ మహాపాత్ర. ఇక ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ శిక్షణకు అసలైతే 14 నుండి 16 సంవత్సరాల వయసుగల వారిని ఎంపిక చేస్తారు. కాని కోచ్ చందన్ యూక టాలెంట్ గుర్తించి ప్రత్యేక అనుమతితో అతనికి ఈ అవకాశాన్ని ఇప్పించారు.


ఇక శిక్షణ నిర్వాహకులు పెట్టిన టెస్ట్ లో 14-16 వయసు గల కుర్రాళ్ల కన్నా 11 సంవత్సరాల చందన్ చురుదనమే వారికి నచ్చింది. అందుకే వెంటనే జర్మనీలో శిక్షణకు పాల్గొనే అవకాశాన్ని అతని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మంది ఈ శిక్షణలో చోటు దక్కించుకుంటారు. ఇక ఈ ఆటగాళ్ల ప్రయాణ ఖర్చులు, వసతి అంతా నిర్వాహకులే చూస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: