రియో ఒలంపిక్స్ లో భార‌త‌జెండాను ఎగ‌రేసిన సింధూకి మ‌రో అరుదైన గౌర‌వం లభించింది.. క్రీడల్లో అత్యత్తమ  ప్రదర్శన క‌న‌బ‌రిచే వారికి ఇచ్చే అవార్డ్ ఖేల్ రత్నఅవార్డ్ కైవసం చేసుకుంది పివి సింధు, అంతేకాదు రియో ఒలంపిక్స్ లో కాస్య పతకాన్ని గెలుచుకున సాక్షి మాలిక్ కు కూడా ఖేల్ రత్న అవార్డ్ అందుకుంది. ఇక ఇదే క్రమంలో అత్యుత్తమ క్రీడాకారుల‌ను తీర్చి దిద్దే గురువుల‌కు ఇచ్చే ద్రోణాచార్య పుర‌స్కారాల  ప్రదానోత్సవం ఈరోజు రాష్టప‌తి భ‌వ‌న్ లో ఘ‌నంగా జ‌రిగింది.  
    
ముందుగా రజత పతాకంతో దేశ గౌరవాన్ని కాపాడిన సింధుకు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని  రాష్టప‌తి చేతుల మీదుగా సింధూ అందుకుంది. ఢిల్లీలోని రాష్టపతి భవన్ లో అట్టహాసంగా జ‌రిగిన ఈ అవార్డు ప్రధానోత్స‌వంలో సింధూ, సాక్షి మలిక్ అద్భుత ప్రద‌ర్నన ప్రద‌ర్శించిన దీపాకర్మాక‌ర్, జీతూరాయ్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను అంద‌జేశారు.  

దీపా కర్మాకర్‌ కోచ్‌ విశ్వశ్వర్‌ నంది, నాగపురి రమేశ్‌, సాగర్‌, రాజ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, మహవీర్‌సింగ్‌లకు ద్రోణాచార్య పురస్కారాలు అందజేశారు. ఇక మిగతా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి కూడా స్పోర్ట్స్ డే సందర్భంగా పురస్కారాలు అందించారు. రహానె, లలితా బాబర్‌, శివ థాపా, వీఆర్‌ రఘునాథ్‌, రాణీ రాంపాల్‌ సహా 15 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో సత్తి గీత, సిల్వానస్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలు ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: