భారత జట్టులో ఒకప్పటి ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన వార్షిక సమావేశంలో సందీప్ పాటిల్ బదులుగా ఎమ్మెస్కే ప్రసాద్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక భారత జట్టు తరపున 7 టెస్ట్ మ్యాచ్ లు.. 17 వన్డేలు ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్ బిసిసిఐ కమిటీలో చైర్మన్ గా నియమించబడిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. 


ఇప్పటిదాకా జూనియర్ సెలెక్షన్ కమిటీలో ఛైర్మన్ గా భాధ్యతలను కొనసాగించిన ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పుడు ఏకంగా బిసిసిఐ కమిటెకే ఛైర్మన్ అవ్వడం విశేషం. ఇక సీనియర్ సెల్క్షన్స్ కమిటీ ఛైర్మన్ గా కూడా ప్రసాద్ అనుభవం పొందాడు. ఇక ఒకప్పటి బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ సెలక్షన్స్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: