నిరుపేద విద్యారుధుల సహాయార్ధం ప్రాజెక్ట్ 511 వారు ఫూడ్ ఫర్ చేంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారట. దాదాపు 15 సంవత్సరాలుగా నడిపిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం వివిఎస్ లక్ష్మన్ ప్రచార కర్తగా ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించినపుడు 511 పాఠశాలకు సహాయం అందించగా ఇప్పుడు ఆ సంఖ్య 1022 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తున్నారట.


ఇక ఈ ఫుడ్ ఫర్ చేంజ్ కార్యక్రమం నగరంలోని అన్ని స్టార్ హోటల్స్ లో సెపరేట్ స్టాళ్లు ఏర్పాటుచేస్తాయని.. 64 దేశీయ, 9 విదేశీ వంటకాలు ఈ మెనులో ఉంటాయని అన్నారు. దీనిపై వచ్చే ప్రతి రూపాయిని పేద విద్యార్ధులకు అందచేస్తామని ప్రాజెక్ట్ 511 చైర్మన్ శ్రీనివాస్ రావు నామాల అన్నారు. సిని నిర్మాత డి.సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాం అయ్యారు.


ఈ ఫుడ్ కూపన్స్ కు టికెట్ ద్వారా అందిస్తే లెక్క కూడా కరెక్ట్ గా ఉంటుంది.. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి పైసా పేదలకు అందాలని అన్నారు. అక్టోబర్ 9న జీఆర్సీ కన్వెన్షన్ ఫుడ్ ఫర్ చేంజ్ ఉత్సవం మొదలు పెట్టనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: