టీం ఇండియా కొత్త కెప్టెన్ విరాట్ కొహ్లి మీద ప్రశంసల వర్షం కురిపించాడు కొహ్లి చిన్ననాటి కోచ్, మెంటర్ రాజ్ కుమార్ శర్మ. అకడెమీలో కూడా కెప్టెన్ గా ఉండేందుకు ఇష్టపడే కొహ్లి జన్మతహ్ కెప్టెన్ అంటున్నాడు రాజ్ కుమార్ శర్మ. ఇక టెస్ట్ కెప్టెన్ గా కొహ్లి 22 టెస్ట్ మ్యాచుల్లో సారధిగా ఉండగా 14 మ్యాచుల్లో విజయం సాధించాడని అన్నారు.


జట్టులో ఆటగాడిగా కన్నా కెప్టెన్ గా మారాక విరాట్ కొహ్లిలో కొన్ని మార్పులు గమనించానని.. కెప్టెన్ గా సర్వత్రా బాధ్యతలు చూసుకుంటూ బ్యాటింగ్ లో కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాడని విరాట్ కొహ్లి మీద పొగడ్తల వర్షం కురిపించారు రాజ్ కుమార్ శర్మ. ఇక మూడు వన్ డేల ఇంగ్లాండ్ సీరీస్ లో మొదటి మ్యాచ్ కైవసం చేసుకున్న కొహ్లి సేన రేపు సెకండ్ మ్యాచ్ ఆడనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: