ఎమ్మెస్ ధోని రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకి కెప్టెన్ అయితే మళ్లీ అంతే సమర్ధుడు దొరికాడు కాని వికెట్ కీపర్ ఎలా అని అనుకున్నారు. కాని అరంగేట్రంతోనే అదరగొట్టిన వృద్ధిమాన్ సాహా లోని ప్రతిభను మెచ్చు ధోని సహకారం అందించాడు. 2015 లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సాహా ఆటతీరుని చూసి వికెట్ కీపర్ గా సాహాను ప్రతిపాదించాడట.


తండ్రి ప్రశాంత గోల్ కీపర్ కావడం చేత సాహా కూడా అదే బాటలో వెళ్లాలనుకున్నాడట. కాని ఐసిఎల్ ఆడటం ఆ తర్వాత ఐపిఎల్ లో ఛాన్స్ రావడం. అందులో బాగా ఆడటంతో టెస్ట్ లో అవకాశం రావడం ఇలా అన్ని జరిగిపోయాయని సాహా తండ్రి ప్రశాంత అన్నారు. ప్రస్తుతం ధోనికి ఆల్టర్నేట్ గా వికెట్ కీపర్ ఎవరు అన్న దాని మీద బిసిసిఐ ఆలోచిస్తుంది. అందివచ్చిన అవాక్శాన్ని వాడుకుంటున్న సాహా ప్రస్తుతం టెస్ట్ లో తన ప్రతిభ కనబరుస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: