తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పతిప్పలు పెట్టే రవిచంద్రన్ అశ్విన్ ఈ సంవత్సరం 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డ్ అందుకున్నారు. 2016-17 సంవత్సరానికి గాను ఈ అవార్డ్ అశ్విన్ కు అందచేశారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నాడు అశ్విన్. ఈ సమయంలో తను మొదటిసారి చెపాక్ స్టేడియంలో సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు అశ్విన్. 


కేవలం 45 టెస్టుల్లో 250 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు అశ్విన్. టెస్టుల్లో 250 పైగా వికెట్లు సాధించిన బౌలర్ గా 12వ స్థానంలో ఉన్నాడు అశ్విన్. మొత్తంగా 49 టెస్టులు ఆడిన అశ్విన్ 275 వికెట్లు తీశాడు. 10 వికెట్లు 7సార్లుతీయగా ఐదు వికెట్లను 25 సార్లు తీశాడు. ఇక వన్ డేల్లో 104 ఇన్నింగ్స్ లో 145 వికెట్లు తీశాడు అశ్విన్.   



మరింత సమాచారం తెలుసుకోండి: