పాక్‌ను చితక్కొట్టారు


క్రికెట్ ను ఈ టీం తో భారతీయులు వదిలేస్తే మంచిది. విజయం కోసం ప్రయత్నమే చేయని దిక్కుమాలిన క్రికెట్ బృందం గతంలో ఎన్ని విజయాలు సాధించినా మన దాయాది పాక్ పై అత్యంతదయనీయం గా ఓడిపోవటం అన్నది క్షమించరాని నేరం. క్రీడల్లో, యుద్దంలో, ప్రేమలో జయాపజయాలు దైవాదీనాలు. కాని విజయం సాధించ టానికి ప్రయత్నమే చేయని  "ఈ  దురదృష్టకర కోహ్లీ  బృందం పాక్ పై చెప్పుకోలేని  అవమానకర రీతిలో ఓటమి చవి చూపి భారతీయుల ఆత్మవిశ్వాసం పైన, ఆత్మ గౌరవంపైన దెబ్బకొట్టగా...మీకెందుకు మేమున్నాం అంటూ అదేసమయంలో అదేరోజు తీవ్రంగా పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది మన హాకీ టీం ఎంత తీవ్రంగా అంటే చరిత్ర కూడా చూడనంతగా. ఇక పాక్ భారత్ కు క్రికెట్లో తమ గెలుపు గురించి మాట్లాడలేనంతగా...మన భారత సైన్యం పాక్ పై ఆనంద తాండవం ఆడేంతగా హాకీ అదే గడ్డపై అదే రోజు పాక్ కు చారిత్రాత్మక అపజయాన్ని రుచిచూపి క్రికెట్ విజయహాసాన్ని చెప్పులేని తీరులో పరాభవం చేసింది. హాట్స్ ఆఫ్ టు ఇండియన్ హాకీ టీం.  



అభిమానులకు ఆదివారం ఆనందం దూరం కాకుండా భారత హాకీ జట్టు ఆదుకుంది. లండన్‌లోనే జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీ ఫైనల్స్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7–1 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత్‌ తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఇటీవల పాక్‌ ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత సైనికులకు నివాళిగా మన ఆటగాళ్లు భుజాలకు నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు.  

world hockey semi league కోసం చిత్ర ఫలితం


భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అవును, అలా ఇలా కాదు, మ్యాచ్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కళ్లు బైర్లు కమ్మేలా చితక్కొట్టింది. అయితే ఇది ఒళ్లంతా కళ్లు చేసుకుని లోకమంతా చూసిన క్రికెట్‌ మ్యాచ్‌లో కాదు. హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీ ఫైనల్స్‌ టోర్నీలో, కోహ్లి సేన కలిగించిన నిరుత్సాహాన్ని పోగొట్టి మీసం మెలేసేలా చేసిన మన హాకీ జట్టు వరుసగా మూడు విజయాలతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.


విశ్వవ్యాప్తంగా భారత క్రీడాభిమానులంతా తమ దృష్టిని క్రికెట్‌పైనే ఉంచి భంగపాటుకు గురైనా, భారత హాకీ జట్టు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. లండన్‌లోనే జరుగుతున్న హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో తమ పూల్‌ ‘బి’లో అగ్రస్థానంతో పాటు క్వార్టర్స్‌ చేరింది.

world hockey semi league కోసం చిత్ర ఫలితం

ఓవరాల్‌గా పాకిస్తాన్‌పై భారత్‌కు ఇదే భారీ విజయం. గతంలో చాంపియన్స్‌ ట్రోఫీ (2003), కామన్వెల్త్‌ గేమ్స్‌ (2010)లలో భారత్‌ 7–4 గోల్స్‌ తేడాతో నెగ్గింది. మంగళవారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో ఆడనుంది. డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (13, 33వ నిమిషాల్లో), తల్వీందర్‌ సింగ్‌ (21, 24వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (47వ, 59వ ని.లో) రెండేసి గోల్స్‌ చేయగా, ప్రదీప్‌ మోర్‌ (49వ ని.) ఒక గోల్‌ సాధించాడు. పాక్‌ నుంచి ఉమర్‌ భుట్టా (57వ ని.లో) ఏకైక గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆరంభంలో పాక్‌ కాస్త జోరును ప్రదర్శించినా ఆ తర్వాత మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ చేతుల్లోకి వచ్చింది.


ఇటీవలి కాలంలో పాక్‌ ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారత సైనికుల మృతికి నివాళిగా హాకీ ఆటగాళ్లు తమ భుజానికి నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు. భారత ఆర్మీకి హాకీ ఆటగాళ్లు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ ముష్తాక్‌ అహ్మద్‌ అన్నారు.

World Hockey League Semi Final India vs Pakistan Match Live Score 2015

మరింత సమాచారం తెలుసుకోండి: