టీం ఇండియా యువ సంచలనం హార్ధిక్ పాండ్య ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ బౌలర్లకు స్టార్ బ్యాట్స్ మన్స్ అంతా వికెట్లప్పచెబితే ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య మాత్రం అదరగొట్టేశాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన హార్దిక్ పాండ్య టోటల్ స్కోర్ 76 పరుగులకు రనౌట్ అయ్యాడు.


చూడటానికి టీం ఇండియా బలంగా కనబడ్డా పాకిస్తాన్ పై అన్ని అంశాల్లో విఫలమైంది. ఇక ఐసిసి ఫైనల్స్ లో గిల్ క్రిస్ట్ రికార్డును బ్రేక్ చేశాడు హార్ధిక్ పాండ్య. 1999లో ఐసిసి ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై గిల్ క్రిస్ట్ 33  బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో పాండ్య 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డుల్లో నిలిచాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: