శ్రీలంకతో జరుగనున్న సీరీస్ లో టీం ఇండియా సమర్ధవంతంగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 3 టెస్టులు, 5 వన్డేలు, 1 టి20 మ్యాచ్ లను ఆడనున్న టీం ఇండియాకు మెక్ గ్రాత్ సలహాలు ఇచ్చారు. శ్రీలంక పిచ్ లు బౌలింగ్ కు సహకరిస్తాయని.. అయితే ఫుల్ లెంగ్త్ బంతులేస్తే మాత్రం శ్రీలంక బ్యాట్స్ మన్ బౌడరీలు కొడతారని అన్నాడు.


ఇక త్వరగా బౌలింగ్ చేస్తూ స్వింగ్ లో బౌలింగ్ చేయాలని సూచించాడు మెక్ గ్రాత్. పిచ్ లో మార్పులని బట్టి బౌలింగ్ లో అప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని అన్నారు. ఇక భారత బౌలర్ ఉమేష్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు మెక్ గ్రాత్. నిలకడగా వికెట్లు తీస్తున్నాడని ఉమేష్ గురించి ప్రస్తావించగా భువనేశ్వర్ రెండు వైపులా స్వింగ్ చేయడం మంచి విషయమన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: