కొన్నేళ్ళ క్రితం భారత క్రికెట్ జట్టు అంటే పెద్ద క్రేజ్ ఉండేది కాదు. ఎందుకంటే ఓ సీరిస్ నెగ్గితే మరో సీరిస్ చేజార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాని ప్రెజంట్ టీమిండియా అలా కాదు. సీరిస్ అంటే యువ రక్తం ఉరకలేస్తోంది. విజయం సాధించే వరకు పట్టిన పట్టు వీడటం లేదు. 


ఇక టీమిండియా జట్టులోకి కొత్త యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఐపీఎల్ పుణ్యమాని ప్రెజెంట్ టాలెంట్ కి కొదవేం లేదు. అలాగే గతంతో పోలిస్తే మ్యాచ్ లు ఆడే సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లు ఫిట్ నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓ వైపు యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. దీంతో సీనియర్లు తన ప్లేస్ ని నిలబెట్టుకోవాలంటే ఫిట్ నెస్ తప్పనిసరి. 


ఇక టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆటను ఈ మధ్య కాలంలో అందరూ చూస్తూనే ఉన్నారు. విరాట్ దూకుడుకు పెట్టింది పేరు. అయితే మరో ఆరేడేళ్లు మాత్రమే విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని కొన్ని అంచనాలున్నాయి. కోహ్లీ మాత్రం తాను ఖచ్చితంగా పదేళ్లపాటు ఆడగలనని ధీమాగా చెబుతున్నాడు. 


'మనలో చాలామందికి వాళ్లు ఎంత రేంజ్ కి ఎదుగుతారో తెలియదు. మన సామర్థ్యంలో 70 శాతం మేరకే వినియోగించుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో మనకి మనమే ప్రేరణ ఇచ్చుకోవాలి. నేను బాగా కష్టపడితే మరో పదేళ్లు ఆడగలనని భావిస్తున్నాను. ఫిట్ నెస్ తో ఉంటే అది సాధ్యమే' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: